సందీప్ కిషన్ మరో సినిమా

సందీప్ కిషన్ కు మంచి మంచి బ్యానర్లు దొరుకుతున్నాయి. కథలు, దర్శకులు దొరుకుతున్నారు. కానీ బ్లాక్ బస్టర్ రావడం లేదు. త్వరలో టైగర్ సినిమా ఆ లోటు తీరుస్తుంది అనుకుంటున్నారు.  Advertisement ఇప్పుడు మరో…

సందీప్ కిషన్ కు మంచి మంచి బ్యానర్లు దొరుకుతున్నాయి. కథలు, దర్శకులు దొరుకుతున్నారు. కానీ బ్లాక్ బస్టర్ రావడం లేదు. త్వరలో టైగర్ సినిమా ఆ లోటు తీరుస్తుంది అనుకుంటున్నారు. 

ఇప్పుడు మరో మంచి యూనిట్ సందీప్ కిషన్ కు జోడయింది. అనిల్ సుంకర్ ఓ తన బ్యానర్ లో సందీప్ తో ఓ సినిమా చేయబోతున్నాడు. సిద్దార్ధ సినిమాలకు రచయితగా పని చేసిన రాజ సింహా ఈ సినిమాతో డైరక్టర్ గా పరిచయం అవుతున్నాడు. 

ప్రస్తుతం తమిళంలో ఓ పెద్ద సినిమా చేస్తున్నాడు సందీప్ కిషన్. అది పూర్తి కాగానే ఇది సెట్ మీదకు వెళ్తుంది.