Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

కిక్ 2 పరిస్థితి ఏమిటి?

కిక్ 2 పరిస్థితి ఏమిటి?

మే ఫస్ట్ వీక్ కే రెడీ అయి ప్రేక్షకుల ముందుకు వస్తుంది అని వార్తలు వినిపించాయి కిక్ 2 విషయంలో. కానీ సెకెండ్ వీక్ వస్తున్నా సందడి లేదు. 14న లయన్ వస్తుంది అంటున్నారు కాబట్టి కిక్ 2 రాదు. కళ్యాణ్ రామ్ అందుకు ఓకె అనడు. ఆ తరువాతి వారమే రావాలి. 

ఇదిలా వుంటే కిక్ 2 కి సంబంధించి ఇంకా పోస్టు ప్రొడక్షన్ పనులు బకాయి వున్నాయని, అవి పూర్తి కావాల్సి వుందని వార్తలు వినవస్తున్నాయి. కళ్యాణ్ రామ్ పటాస్ సినిమా ముందు చాలా దెబ్బతిన్నాడు. పటాస్ సినిమాకు పివిపి దగ్గర భారీగా ఫైనాన్స్ తీసుకోవాల్సి వచ్చింది. అలా అని పటాస్ మరీ లాభాలు కుమ్మేయలేదు. 

నాలుగైదు కోట్ల వరకే లాభాలు వచ్చినట్లు బోగట్టా. ఇప్పుడు ఆ డబ్బులు, కొత్త అప్పులు కిక్ 2 మీదకు వచ్చాయి. అందువల్ల దాన్ని సకాలంలో పూర్తి చేసి, లాభాలు కళ్ల చూడకుంటే కళ్యాణ్ రామ్ కు మళ్లీ కష్టమే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?