బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్‌కి న్యాయస్థానం హిట్ అండ్ రన్ కేసులో ఐదేళ్ళు జైలు శిక్ష విధించడంపై పలువురు బాలీవుడ్ ప్రముఖులు విభిన్న రీతుల్లో తమ అభిప్రాయాల్ని వెల్లడిరచారు. సోషల్ మీడియా చేతిలో వుందిగా.. ఎవరికి తోచిన విధంగా వారు ట్వీట్లేసి, ఫేస్‌బుక్‌లో కామెంట్లు పెట్టి.. అందర్నీ విస్మయానికి గురిచేశారు.
సింగర్ అభిజిత్ అయితే ఆత్మహత్య నేరమయినప్పుడు ఫుట్‌పాత్‌పై నిద్రించడం ఎందుకు నేరం కాకూడదు.? ఫుట్‌పాత్‌పై పడుకున్నవారు చనిపోతే దానికి వాహనాల డ్రైవర్లు ఎలా కారణమవుతారని ప్రశ్నించాడు. బాలీవుడ్‌లో ఎందరో ప్రముఖులు కిందిస్థాయి నుంచి పైకొచ్చారనీ, వారెవరూ ఫుట్‌పాత్‌పై పడుకోలేదన్నది ఆయన వాదన.
కామెడీగా అనిపించడంలేదూ.? కాస్త హేయంగానూ అనిపిస్తోంది సింగర్ అభిజిత్ వాదన. అసలు ఇలాంటి వాదనలు మెదళ్ళలోంచి పుట్టుకొచ్చి, ఎలా బయటపడ్తాయో ఎవరికీ అర్థం కావడంలేదు. ఫుట్‌పాత్‌పై పడుకోవడం అనేది పేదల దయనీయ స్థితికి నిదర్శనం. వారేమీ సరదాకి ఫుట్‌పాత్‌పై దొర్లడంలేదన్నది చాలామంది అభిప్రాయం. సినీ స్టూడియోల చుట్టూ అవకాశాల కోసం తిరిగిన ఎందరో ఔత్సాహికులు, ఫుట్‌పాత్‌లపైనే నివాసాలు ఏర్పరచుకున్న సందర్భాలు అనేకం.
డిజైనర్ ఫరా అలీఖాన్ వాదన ఇంకోలా వుంది. ఫుట్‌పాత్‌పై ప్రజలు నిద్రపోవడం అనేది ప్రభుత్వాల వైఫల్యం అని అంటున్నారామె. రైలు పట్టాలపై పడుకుంటే వారిపై రైలు వెళ్ళకుండా వుంటుందా? ఫుట్‌పాత్‌పైన పడుకున్నా అంతే కదా.? అని ఆమె అంటుండగా, ఫరా అలీఖాన్ వ్యాఖ్యలూ వివాదాస్పదమయ్యాయి. దాంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. చేసేది లేక, తాను పేదల్ని విమర్శించలేదనీ, ప్రభుత్వాల చేతకానితనాన్ని, అలసత్వాన్ని మాత్రమే ప్రవ్నిస్తున్నానని వివరణ ఇచ్చుకుంది ఫరా అలీఖాన్.