Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

పండగ చేస్కోలేదట

పండగ చేస్కోలేదట

పండగ చేస్కో..కిందా మీదా పడుతూ పూర్తయింది. ఈ నెల 15న విడుదలకు రెడీ అయింది. అయితే ఇప్పుడు లయన్ వచ్చి అక్కడ కూర్చుంది. మరి బాలయ్య సినిమాను ఢీకొనేందుకు రామ్ సై అంటాడా అన్నది చూడాలి. 

ఇదిలా వుంటే, పండగ చేస్కో సినిమా బాగా వచ్చిందని, కానీ దానికీ కాస్త ఆర్థిక సమస్యలు వున్నాయనీ వార్తలు వినవస్తున్నాయి. ఇటీవల పండగ చేస్కో యూనిట్ ఇచ్చిన కొన్ని చెక్కులు బౌన్స్ అయ్యాయన్న వార్త టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. ముంబాయి నుంచి వచ్చిన కొందరు డ్యాన్సర్లు చెక్కులు ఇస్తే బౌన్స్ అయ్యాయని వినికిడి. 

మరి ఎంతవరకు నిజమో తెలియాల్సి వుంది. అదే నిజమైతే ఈ మధ్య ఫైనాన్స్ సమస్యల్లో పడుతున్న చాలా సినిమాల జాబితాలో ఇది కూడా చేరే ప్రమాదం వుంది. దానా దీనా మరి 15కు వస్తుందా? లేక 22 వెళ్తుందా అన్నది చూడాల్సి వుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?