వర్మ ఎక్కడ?

ఐస్ క్రీమ్ విడుదలవ్వగానే ఐస్ క్రీమ్ 2 ప్రకటించి, ఫస్ట్ లుక్ చూపించేసాడు రామ్ గోపాల్ వర్మ. ఆ తరువాత అనుక్షణం మీద బిజీ అయిపోయారు. అది వచ్చింది వెళ్లింది. ఇప్పుడు రామ్ నుంచి…

ఐస్ క్రీమ్ విడుదలవ్వగానే ఐస్ క్రీమ్ 2 ప్రకటించి, ఫస్ట్ లుక్ చూపించేసాడు రామ్ గోపాల్ వర్మ. ఆ తరువాత అనుక్షణం మీద బిజీ అయిపోయారు. అది వచ్చింది వెళ్లింది. ఇప్పుడు రామ్ నుంచి రావాల్సినవి మూడు సినిమాలు వున్నాయి. ఒకటి ఐస్ క్రీమ్ 2, రెండు రాజశేఖర్ తో పట్టపగలు. ఇవి కాక ఆయన ప్రకటించిన సినిమాలు చాలా వున్నాయి. 

ఎక్సెస్ అనే ఎరోటిక్ సినిమా, మోహన్ బాబుతో మరో సినిమా కూడా రావాల్సివుంది. ఇంతలో సావిత్రి…కాదు కాదు శ్రేదేవి అంటూ ఓ థర్డ్ గ్రేడ్ సినిమా ప్రకటించారు. దాని మీద జరగాల్సినంత హడావుడి జరగింది. ఉన్నట్లుండి సైలెన్స్. ఐస్ క్రీమ్2 రెడీ అయిపోయినా రాలేదు. దానికి నానా హడావుడి చేసారు. ఇంగ్లీషు పాట వగైరా. మోహన్ బాబు సినిమా డ్రాప్ అని వినికిడి,. రాజశేఖర్ సినిమా ఏ స్టేజ్ లోవుందో తెలియదు. పైగా ఈ మధ్య ట్వీట్లు కూడా ఆగాయి. ఇంతలో రానా మళ్లీ  ఆర్జీవీతో సినిమా చేస్తాడని వార్తలు వినవచ్చాయి. అయితే అంతలోనే అది నిజంకాదనే వార్తలు వినవచ్చాయి.

 ఇప్పుడింతకీ వర్మ ఎక్కడ అన్నది ఫ్రశ్న. ఐస్ క్రీమ్ 2 ఏమయిందన్నది ఇంకో ప్రశ్న. సినిమా విడుదలకు ఆర్జీవీ కనిపెట్టిన అద్భుతమైన కొత్త పద్దతి ఎటుమాయమైందన్నది ఇంకో..ఇంకో ప్రశ్న. వర్మ సినిమాల్లో నటించడానికి హీరోలు మిగలనట్లే, విడుదలకు పంపిణీ దారులు, తీయడానికి నిర్మాతలు మిగల్లేదని కృష్ణనగర్ లో జోకులు వినిపిస్తున్నాయి.