నైజాంలో నెంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్..అందులో సందేహం లేదు. కానీ అప్పుడప్పుడు పోటీ వస్తుంటుంది, తప్పదు. అప్పుడే స్ట్రాటజీలు ప్రారంభమవుతాయి. ఇప్పుడు దిల్ రాజు అలాంటి స్ట్రాటజీనే వర్కవుట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
హీరో నితిన్ స్వయంగా అఖిల్ సినిమా నిర్మిస్తున్నాడు. సినిమా షూటింగ్ లో వుండగానే, తమకు నైజాంలో డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ వున్నా కూడా, సినిమా నైజాం హక్కులు మాంచి రేటుకు అమ్మేసారు. ఇదిలా వుంటే అదే నైజాంలో రామ్ చరణ్ 'బ్రూస్ లీ' హక్కులు తీసుకున్నాడు దిల్ రాజు.
అఖిల్ సినిమా ముందుగానే అక్టోబర్ 21న డేట్ ప్రకటించారు. అఖిల్ తో తనకు మంచి స్నేహం వున్నందున, రామ్ చరణ్ ఆ సినిమాకు కాస్త దూరంగా తన సినిమా విడుదల చేద్దామనుకుంటున్నాడట. కానీ దిల్ రాజు మాత్రం అక్టోబర్ 15న విడుదల చేయాల్సిందే అని పట్టుబడుతున్నాడని వినికిడి.
దిల్ రాజు చేతిలో నైజాంలో, ఉత్తరాంధ్రలో చాలా థియేటర్లు వున్నాయి. ఇప్పుడు 15న బ్రూస్ లీ విడుదలయితే, 21న అఖిల్ కు ధియేటర్లు తగ్గే అవకాశం వుంది. ఆఫ్ కోర్స్ నాగ్ కు సన్నిహితుడు సురేష్ కూడా, నిర్మాత నితిన్ తండ్రి కి కూడా థియేటర్లు అందుబాటులో వుంటాయి. ఏదైనా నిర్మాతలు పోటీ పడడం వేరు. డిస్ట్రిబ్యూటర్లు పోటీ పడడం వేరు. అయినా ఎప్పుడూ చాలా జాగ్రత్తగా సీజన్, టైమ్ ఎంచుకుని వస్తాడు రామ్ చరణ్. కానీ ఈ సారి అలా కుదిరేలా లేదు.