కింగ్ నాగార్జునకు ఈ సారి బర్త్ డే వెరీ వెరీ స్పెషల్. తను హీరోగా చేస్తున్నాడు. అదే టైమ్ లో ఇద్దరు కొడుకులు హీరోలైపోయారు. పైగా ముగ్గురి సినిమాలు దాదాపు రెడీ అవుతున్నాయి. మూడూ డిఫరెంట్ జోనర్లు.
Advertisement
పైగా తన తండ్రి ఆఖరు సినిమా, తమ బ్యానర్ కు పర్మనంట్ ల్యాండ్ మార్క్ గా నిలిచిపోయిన మనం సినిమా అనేక అవార్డులుసాధించింది. ఇంతకన్నా హ్యాపీ ఏం కావాలి? అందుకే తమ ఫ్యామీలీ మెంబర్లతో కలిసి నాగ్ తన బర్త్ డే జరుపుకోవడానికి బ్యాంకాక్ వెళ్లిపోయాడు.
అక్కడ బర్త్ డే వేడుకలు, షాపింగ్, సైట్ సీయింగ్ అన్నీ పూర్తి చేసుకుని, వారం తరువాత వస్తాడు. కింగ్ అండ్ కో ఎంజాయ్ అంటే ఆ మాత్రం టైమ్ పడుతుంది మరి.