పూర్తి చేస్తే చాలు..ఫ్రీగా చేసేస్తా

సినిమా ప్రారంభించి, చక్కా పూర్తి చేసి విడుదల చేస్తే చాలు అన్నట్లుందిట హీరో నారా రోహిత్ కు. ఈ మధ్య దొరికిన కొన్ని సినిమాలు, కొంత మంది ప్రొడ్యూసర్ల కారణంగా నారా రోహిత్ కు…

సినిమా ప్రారంభించి, చక్కా పూర్తి చేసి విడుదల చేస్తే చాలు అన్నట్లుందిట హీరో నారా రోహిత్ కు. ఈ మధ్య దొరికిన కొన్ని సినిమాలు, కొంత మంది ప్రొడ్యూసర్ల కారణంగా నారా రోహిత్ కు ఇలాంటి వైరాగ్యం కలిగిందని వినికిడి.

దాంతో రెమ్యూనిరేషన్ సంగతి తరువాత, మంచి కథ, మంచి ప్రాజెక్టు వుంటే నటించేందుకు రెడీ అన్న అభిప్రాయంతో వున్నాడట. నిజానికి నారా రోహిత్ వైవిధ్యమైన నటుడు. అతని సినిమాలపై ఓ ఒపీనియన్ అంటూ వుంది. కానీ సరైన బ్యానర్లు పడడం లేదు.

అప్పటికీ ఆ మధ్య తనే స్వంతంగా ట్రయ్ చేసాడు కూడా. మరి ఆ టైమ్ ఎప్పుడు వస్తుందో నారా రోహిత్ కు. ఒక్క హిట్ సరైనది పడితే చాలు, మంచి బ్యానర్లు క్యూ కడతాయి.