హీరోయిన్ లేని టీజరా?

నాగ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన సోగ్గాడే చిన్ని నాయనా, కొడుకు సినిమా అఖిల్, మరో కొడుకు సినిమా సాహసం శ్వాసగా సాగిపో టీజర్లు విడుదలయ్యాయి. నాగ్ సినిమా టీజర్ పక్కా సినిమా పక్షంగా…

నాగ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన సోగ్గాడే చిన్ని నాయనా, కొడుకు సినిమా అఖిల్, మరో కొడుకు సినిమా సాహసం శ్వాసగా సాగిపో టీజర్లు విడుదలయ్యాయి. నాగ్ సినిమా టీజర్ పక్కా సినిమా పక్షంగా అన్ని విధాలా ఓకె అనిపించేసుకుంది.

అఖిల్ సినిమా టీజర్..పక్కా మాస్ యాక్షన్ మసాలా అని చెప్పకనే చెప్పింది. దాని జోనర్ అది కాబట్టి, హీరోయిన్ టీజర్ లో కనిపించకున్నా ఓకె. కానీ గౌతమ్ మీనన్ సినిమా 'సాహసం, శ్వాసగా సాగిపో' సినిమా టీజర్ మాత్రం అప్ టు ది మార్క్ లేదనే చెప్పాలి. టీజర్ ఎటువంటి ఇంపాక్ట్ కలుగచేయలేదు. లవ్ ప్లస్ రోడ్ మూవీ అన్న ఇండికేషన్ మాత్రం ఇచ్చింది.

Click Here For Teaser

ఇలాంటి సినిమాకు హీరోయిన్ ఫేస్ కూడా జస్ట్ ఎట్ ఎ గ్లాన్స్ చూపిస్తే బాగుండేది. కానీ వెనుకనుంచి చూపించి ఊరుకున్నారు. పైగా రెహమాన్ సంగీతం అంటూ ఓ ఓల్డ్ క్లాసిక్ స్టయిల్ ట్యూన్ వినిపించారు. అసలే గౌతమ్ మీనన్ సినిమా అంటే ఫీల్ అద్భుతంగా వుంటుందని అంచనాలు వుంటాయి. మరి టీజర్ ఇలా మరీ కాస్త చప్పగానే వుందనిపించింది ఏమిటో