టాలీవుడ్ శివ నామస్మరణ

కార్తీకమాసం ఇంకా రాలేదు….కానీ టాలీవుడ్ లో శివనామస్మరణ మొదలైపోయింది.  సక్సెస్ వెనకాల పరుగెత్తే టాలీవుడ్ ఇప్పుడు కొరటాల…శివా..శివా..శివా..అంటోంది. తాజగా ఈ జాబితాలో మెగాస్టార్ చిరంజీవి కూడా చేరారని వినికిడి. మెసేజ్ ను మాస్ ఎంటర్…

కార్తీకమాసం ఇంకా రాలేదు….కానీ టాలీవుడ్ లో శివనామస్మరణ మొదలైపోయింది.  సక్సెస్ వెనకాల పరుగెత్తే టాలీవుడ్ ఇప్పుడు కొరటాల…శివా..శివా..శివా..అంటోంది. తాజగా ఈ జాబితాలో మెగాస్టార్ చిరంజీవి కూడా చేరారని వినికిడి. మెసేజ్ ను మాస్ ఎంటర్ టైన్ మెంట్ ను లింక్ చేసి శ్రీమంతుడు కథ తయారు చేయడం మెగాస్టార్ కు నచ్చిందట.

అందుకే అలాంటి లైన్ ఒకటి తయారు చేయమని శివకు చెప్పాడని టాలీవుడ్ టాక్. గతంలో శివ కథ తయారుచేసినా నచ్చకే రామ్ చరణ్ సినిమా ఆగిపోయింది. మొన్నటికి మొన్న పూరి సినిమా కథ కూడా అలాగే సగంలో అటకెక్కింది. ఆ అనుభవాలు దృష్టిలో వుంచుకుని, మెగాస్టార్ కు కథ అంటే అందరూ జంకుతున్నారు. మరి శివ మరోసారి ట్రయ్ చేస్తాడేమో చూడాలి.

మరో పక్క తనతో సినిమా రెడీ చేయమని ఎన్టీఆర్ ఇటు మైత్రీ మూవీస్ ను, అటు శివను వత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసమే ఎన్టీఆర్ సడెన్ గా లండన్ నుంచి వచ్చి, శివను తానే ఇంటికి వెళ్లి మరీ కలిసి వెళ్లిన సంగతి తెలిసిందే. 

ఇదిలా వుంటే మాంచి కథ రెడీ చేస్తే, పవన్ కళ్యాణ్ తో ప్రెస్టీజియస్ గా వంద కోట్ల సినిమా చేద్దామని అంటున్నాడట దిల్ రాజు. ఇప్పకిప్పుడు శివ సినిమా చేయాల్సిన నిర్మాత దానయ్య మాత్రం బన్నీ కోసం కథ రెడీ చేయమంటున్నాడట. ఇవన్నీ కాదు అఖిల్ రెండో సినిమా కోసం కథ రెడీ చేయండి, తాను నిర్మిస్తానని అంటున్నాడట బండ్ల గణేష్. ఇలా అందరూ..శివా..శివా..శివా అంటున్నారు. ఇంతకీ ఆ శివుడు ఎవర్ని కనికరిస్తాడో?