సెక్సీగా పాడుతూ, గ్లామర్‌ అందించే గాయనీమణులు

గతంలో పాటలు పాడే ఫిమేల్‌ ఆర్టిస్టులు గాత్రానికి తప్ప ఇతరత్రా అలంకరణలకు ప్రాధాన్యత ఇచ్చేవారు కాదు. ఎల్‌ఆర్‌ ఈశ్వరి సైతం సెక్సీ పాటలు పాడినా ఒంటినిండా చీర, తలలో పూలచెండుతో కనిపించేది. ఇప్పుడు ట్రెండ్‌…

గతంలో పాటలు పాడే ఫిమేల్‌ ఆర్టిస్టులు గాత్రానికి తప్ప ఇతరత్రా అలంకరణలకు ప్రాధాన్యత ఇచ్చేవారు కాదు. ఎల్‌ఆర్‌ ఈశ్వరి సైతం సెక్సీ పాటలు పాడినా ఒంటినిండా చీర, తలలో పూలచెండుతో కనిపించేది. ఇప్పుడు ట్రెండ్‌ మారింది. ఇమేల్‌ సింగర్స్‌ ఎంతో సెక్సీగా అలంకరించుకుని టైట్‌ జీన్స్‌తో, స్లీవ్‌లెస్‌లతో అటు గాత్రంలోతోనూ, ఇటు గ్లామర్‌తోనూ శ్రోతలను కవ్వించి వదిలిపెడుతున్నారనడంలో సందేహం లేదు.

వీరిలో ముఖ్యంగా గీతామాధురి, శ్రావణ భార్గవి, విజయలక్ష్మిలు మంచి పొజిషన్‌లో వున్నారని లెక్కలుగట్టారు. అఫ్‌కోర్స్‌ ఫిమేల్‌ సింగర్స్‌ దుప్పట్లు కప్పుకుని పాటలు పాడాలనే రూలేం లేదు కదా. వాళ్ళ డ్రెస్‌ సెన్స్‌నీ, నడుం ఊపులనూ తప్పు పట్టడంలో మూర్ఖత్వం తప్ప ఇంకేమీ లేదు అనేవారూ లేకపోలేదు. 

నేటి గాయనీ మణులను చూస్తే ఇంకేవో రకరకాల భావాలకు లోనుకాక తప్పదు. పైగా వాళ్ళు పాడే పాటలు కూడా ‘ఆటో అప్పారావు.. లాంటి కిక్‌ ఇచ్చే సాంగ్స్‌ కాబట్టి, వాళ్ళ పాటలు వింటూ గ్లామర్‌ని ఎంజాయ్‌ చెయ్యడం అదనపు బోనస్‌ అంతే.