ఈరోజుకీ టేప్‌రికార్డర్‌లో విన్నట్టుంటుంది

మనిషి అన్నాక వయసు, దాని ప్రభావం ఆరోగ్యం మీద అవయవాల మీద పడుతూనే వుంటుంది. అయినాసరే ఆయన అమృతం తాగిన గంధర్వుడిలాగా ఈనాటికీ ఒక్క స్వరం తేడా లేకుండా టేప్‌రికార్డర్‌లో రిపీట్‌గా వింటున్నామా? అన్నట్లుగా…

మనిషి అన్నాక వయసు, దాని ప్రభావం ఆరోగ్యం మీద అవయవాల మీద పడుతూనే వుంటుంది. అయినాసరే ఆయన అమృతం తాగిన గంధర్వుడిలాగా ఈనాటికీ ఒక్క స్వరం తేడా లేకుండా టేప్‌రికార్డర్‌లో రిపీట్‌గా వింటున్నామా? అన్నట్లుగా పాటలు పాడుతూ నిత్య స్వర ప్రేమికుడు ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం. ఎప్పుడో నలభయ్యేళ్ళకు ముందే సినిమాల్లో పాడటానికి వెళ్ళిన ఆయన్ని ఎస్‌పి కోదండపాణి ఆదరిస్తే, నటుడు పద్మనాభం ‘శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న’ చిత్రంలో ఆయనకు పాడే అవకాశాన్ని కల్పించాడు. 

అప్పటినుంచి ప్రారంభమైన ఆయన స్వరరాగరaరి నేటికీ నిరంతరాయంగా అలరిస్తూనే వుండడం విశేషం. ఈ వయసులోనూ పాటలు పాడటాన్ని ఆస్వాదిస్తున్న ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం వ్యక్తిగానూ ఎంతో ఉన్నతమైన వ్యక్తిత్వం కలవాడు. ఎలా సాధ్యం.? ఎక్కడా స్వరంలో తేడా లేకుండా అదే పాటను మక్కీకి మక్కీగా పాడటం.? ఇవి ఎరికీ అర్థం కాని విషయాలు. 

నేటి గాయకులు వాళ్ళు పాడిన పాటనే రెండోసారి పాడినప్పుడు ఇంకో కొత్త పాట విన్నట్లే వుంటుందిగానీ, ఎస్పీ బాలు పాటని మాసిపోనివ్వడు. ఇవ్వాళ సినిమాల్లో పాడటం తగ్గించినా, ‘పాడుతా తీయగా’ ప్రోగ్రామ్‌ ప్రపంచ వ్యాప్తంగా ఆయన తన ఉనికిని చాటుకుంటూనే భావితరాల గాయకులకు ఎన్నో విలువైన సలహాలిచ్చి ప్రోత్సహిస్తున్న ఎస్‌పి బాలు నిజంగా ఓ అద్భుతం.