సినిమా బాగోగుల్ని నిర్ణయించి రేటింగ్ ఇవ్వడానికి వెబ్‌సైట్లకు వున్న అర్హత ఏంటి.? మా వ్యక్తిగత జీవితాలపై బురద జల్లి పబ్బం గడుపుకునే సైట్లను నేను చూడను.. అంటున్నాడు హీరో సిద్దార్ధ.
పైగా, జర్నలిస్టు అనేవాడికి కొన్ని విలువలు వుంటాయి. అలాంటి కొంతమంది జర్నలిస్ట్‌లు నాకు కొందరు తెలుసు. వాళ్ళు రాసినవి మాత్రమే చదువుతానంటున్నాడు. నామీద గానీ, ఇతర ఆర్టిస్టుల మీదగానీ వాళ్ళు రోజూ ఏదో ఒకటి రాస్తూనే వుంటారు. అలాంటి వాటిమీద స్పందించాల్సిన అవసరం లేదు.. అంటూ ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సిద్దార్ధ చెప్పాడు.
స్టార్‌డమ్ అనేదానిని నేను భరించలేను. హీరోగా నా వర్క్ చేసుకుంటూ పోతాను. నేను హీరో అవ్వాలని కలగన్నాను కష్టపడి అయ్యాను. నాప్రైవసీ కోసం నేను ఒంటరిగా వుంటాను. ఇప్పుడు నేను మళ్ళీ తెలుగులో బిజీ అయ్యే ప్రయత్నాలు చేస్తున్నాను. బొమ్మరిల్లు సిద్దార్ధని మరిపించే సినిమా చేసి ప్రశంసలు అందుకోవలానుకుంటున్నానని చెబుతున్నాడు సిద్దార్ధ.