ఇన్నాళ్లు వర్మ తన అభిప్రాయాలు మాత్రమే ట్వీట్ చేసేవాడు. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి, ఎవరో తన పక్కనున్నవాడు తనతో అన్న మాటలు కూడా ట్వీట్ చేసేస్తున్నాడు.లేదా అలా పక్కోడు అన్నాడు అని చెప్పి, తన మనసులో మాటలు బయటపెడతున్నాడో?
అఖిల్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ చూసి, ఎవరో అన్నారట, మెగా, సూపర్, పవర్, రెబల్,క్రేజీ స్టార్ లు అంతా సినిమాలు మానేసి ఇంకేవో పనులు చేసుకోవాల్సి వుంటుందని. సినిమా పుట్టిన తరువాత ఇలా అందరు హీరోలను ఇంటికి ఒకేసారి పంపించే మొనగాడు పుట్టలేదు. చిరంజీవి వచ్చి, అప్పటి వరకు వున్నవాళ్లను పంపిందీ లేదు.
మహేష్ వచ్చి, ఆ పని చేసిందీ లేదు. ఎవరి మార్కెట్ వారిది. ఎవరి స్టామినా వారిది. ప్రపంచ సినిమా వ్యవహారాలు అన్నీ తెలిసి కూడా వర్మ ఇలా దారికిపోయే దానయ్యల కామెంట్లు తన చేతికి పులుముకుని ట్వీట్ చేయడం ఎందుకో? ఇలా పిచ్చి పిచ్చి ట్వీట్ లు చేసి, ఆఖరికి వున్న గౌరవం కూడా తన చేత్తో తనే తీసేసుకుంటున్నాడు వర్మ.