నార్త్ కెరొలినాలో తెదేపా విజయోత్సవాలు

ఎన్.ఆర్.ఐ టి.డి.పి నార్త్ కెరొలినా తె.దే.పా విభాగం వారి ఆద్వర్యంలో, జూన్ 8వ తేదిన సరి కొత్త ఆంధ్రప్రదేశ్ గా, నవ్యాంధ్ర ప్రదేశ్ గా నూతన రాష్ట్ర అవతరనోత్సవ సభ దిగ్విజయంగా పండుగ వాతావరణంలో…

ఎన్.ఆర్.ఐ టి.డి.పి నార్త్ కెరొలినా తె.దే.పా విభాగం వారి ఆద్వర్యంలో, జూన్ 8వ తేదిన సరి కొత్త ఆంధ్రప్రదేశ్ గా, నవ్యాంధ్ర ప్రదేశ్ గా నూతన రాష్ట్ర అవతరనోత్సవ సభ దిగ్విజయంగా పండుగ వాతావరణంలో జరిగినది. క్యారి, మొర్రిస్విల్లె, ఎపెక్ష్ మరియు ర్యాలీ ప్రాంతంలో నివసించు తెలుగువారందరు పాల్గొన్నారు.

క్యారి లోని ట్విన్ లేక్స్ కమ్యూనిటీ సెంటర్లో ఉదయం 9:00గం తెదేపా వ్యవస్థాపకులు స్వర్గీయ శ్రీ.నందమూరి తారక రామరావు గారి చిత్రపటం ఫై జ్యోతిని వెలిగించి కార్యక్రమాలను ప్రారంభిచారు. మా తెలుగు తల్లికి మల్లెపూదండా మరియు కొన్ని దేశ భక్తి గీతాలను స్థానిక గాయని గాయకులూ స్రవన్ మరియు కాంతి ఎడవల్లి గారు ఆలపించారు, అనంతరం అట్టాహాసంగా ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణస్వీకారోత్సవ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని ప్రవాసులందరు అనందోత్సవాలమధ్య తిలకించినారు. శ్రీ ఎన్.టి.రామారావు గారి జీవిత చిత్ర విశేషాలతో పాటు, తెలుగుదేశం పార్టి వ్యవస్థాపన గురించి మరియు చంద్రబాబునాయుడు గారి 9 ఏళ్ల పరిపాలన విశేషాలతో కూడిన వీడియో ప్రదర్శనను ప్రదర్శించినారు.

కమ్యూనిటీ సెంటర్ మొత్తం తె.దే.పా పసుపు జెండాల తో, బ్యానర్ లతో మరియు పసుపు బెలూన్లతో పసుపు మయం అయింది. కార్యక్రమానికి ముఖ్యఅతిధి గా విచ్చేసిన డా. రాజ్ పోలవరం గారు ప్రవాసులందరికి నూతన రాష్ట్రాభివృద్ధికి చేయుతనివ్వాలని పిలుపునిచ్చారు. ఇండియా నుంచి తమ పిల్లలను చూడడానికి వచ్చిన పెద్దలు, రామారావు గారితో మరియు చంద్రబాబునాయుడు గారితో తమ అనుభవాలని పంచుకొన్నారు. నిర్వాహకులు కార్యక్రమానికి హాజరైన అందరికి రుచికరమైన అల్పాహారం, టీ పానియములతో పాటు పసందైన మధ్యాన్న భోజనాన్ని సమకూర్చినారు.

ఎన్.ఆర్.ఐ టి.డి.పి నార్త్ కెరొలినా తె.దే.పా విభాగం వ్యవస్థాపకులు మరియు కార్యవర్గ బృందం సభ్యులు ఆరెమండ శ్రీనివాస్, రావు ముక్కమాల, శిరీష్ గొట్టిముక్కల, శ్రీని అనంత, కుమార్ చల్లా, సుధాకర్ ఉండవల్లి, మూర్తి అక్కిన, మార్తలా మాధవి, కుమార్ నెప్పల్లి మరియు చారి కంబారా గారు. తె.దే.పా విజయోత్సవ సభ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడంలో స్వచ్చందంగా సహాయ సహకారాలంధించిన తె.దే.పా అభిమానులకు, హాజరైన తెలుగువారందరికి మరియు ఇండియా నుంచి వచ్చిని పెద్దవారందరికి నిర్వాహకులు ధన్యవాదములు తెలిపినారు.