ఈ కామర్స్‌లో అగ్రస్థానం బన్సాల్‌ అగ్రవాల్స్‌దే

భారతదేశంలో ఈ కామెర్స్‌ నడిపేవారిలో 85% మంది బన్సాల్‌ కమ్యూనిటీకి చెందినవారే. ఫ్లిప్‌కార్ట్‌, మైంత్రా, స్నాప్‌డీల్‌, లెన్‌స్కార్ట్‌ – వీటన్నిటిని ప్రారంభించి నిర్వహిస్తున్నది బన్సాల్‌ వర్గానికి చెందినవారే. ఉత్తరభారతానికి చెందిన వైశ్యులు – అగ్రర్వాల్‌లు.…

భారతదేశంలో ఈ కామెర్స్‌ నడిపేవారిలో 85% మంది బన్సాల్‌ కమ్యూనిటీకి చెందినవారే. ఫ్లిప్‌కార్ట్‌, మైంత్రా, స్నాప్‌డీల్‌, లెన్‌స్కార్ట్‌ – వీటన్నిటిని ప్రారంభించి నిర్వహిస్తున్నది బన్సాల్‌ వర్గానికి చెందినవారే. ఉత్తరభారతానికి చెందిన వైశ్యులు – అగ్రర్వాల్‌లు. వారి మూలపురుషుడు మహారాజా అగ్రసేన్‌కు 17 మంది కొడుకులు, ఒక కుమార్తె. గోయల్‌, గర్గ్‌, మిత్తల్‌, సింఘాల్‌, కన్సాల్‌, బన్సాల్‌.. అనే యీ కొడుకుల పేర్లమీదుగా గోత్రాలు ఏర్పడ్డాయి. సాధారణంగా సగోత్రవివాహాలు చేసుకోరు. వీరు ఉత్తరభారతమంతా వ్యాపించి రకరకాల వ్యాపారాలు చేస్తూ వుంటారు. నివసిస్తున్న ప్రదేశం బట్టి అలవాట్లు కొద్దిగా మారుతూ వచ్చాయి. రాజస్థాన్‌ బన్సాల్‌లు శాకాహారులుగానే వుంటారు కానీ పంజాబ్‌ బన్సాల్‌లు మాంసాహారులు. బన్సాల్‌లలో చాలామంది కుటుంబవ్యాపారాలు చూస్తూండగా కొందరు వ్యాపారాలకు కాలం చెల్లిందని భావించి బాగా చదువుకుని ఉద్యోగాలలో చేరారు. 

అగర్వాల్‌లు చేసే వ్యాపారాలలో కిరాణా, స్వీట్స్‌, నగలు, ట్రాన్స్‌పోర్టు యివన్నీ వుంటాయి. ఇక ఉద్యోగుల్లో అయితే పాతతరం వాళ్లు బ్యాంకుల్లో చేరారు. కొత్తతరం వాళ్లు ఐఐటీవైపు మొగ్గారు. ఐఐటీ ఎంట్రన్సు పరీక్షలకు కోచ్‌ చేసే మొట్టమొదటి ట్రెయినింగ్‌ సెంటర్‌ను జి డి అగర్వాల్‌ అనే ఆయన 1962లో పెట్టాడు. బన్సాల్‌ అనే ఆయన ఎంతమందికి తర్ఫీదు యిచ్చి ఐఐటి, ఐఐఎమ్‌లకు పంపాడో లెక్కే లేదు. ప్రస్తుతం ఈ కామెర్స్‌ ఏలుతున్న బన్సాల్‌లలో 80% మంది ఐఐటి గ్రాడ్యుయేట్లే. వాళ్లు పాతతరం నుండి సంక్రమించిన వ్యాపారలక్షణాలకు, తాము నేర్చుకున్న ఆధునిక సాంకేతికతను జోడించి అభివృద్ధిపథంలో దూసుకుపోతున్నారు. 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌

[email protected]