అందులో ‘మ‌నం’ కి స్థానం లేదా??

మ‌నం డీసెంట్ హిట్‌!  మంచి సినిమా. అంత‌కు మించి మ‌న‌సుకు హ‌త్తుకొనే సినిమా. ఎవ‌ర‌డిగినా ఇదే మాట చెబుతున్నారు. ఈ సినిమా విడుద‌లై మూడు వారాలు కావొస్తుంది. ఏ సినిమాకైనా ఇలాంటి టాక్ ద‌క్కితే..…

మ‌నం డీసెంట్ హిట్‌!  మంచి సినిమా. అంత‌కు మించి మ‌న‌సుకు హ‌త్తుకొనే సినిమా. ఎవ‌ర‌డిగినా ఇదే మాట చెబుతున్నారు. ఈ సినిమా విడుద‌లై మూడు వారాలు కావొస్తుంది. ఏ సినిమాకైనా ఇలాంటి టాక్ ద‌క్కితే.. మూడువారాల్లో రూ.50 కోట్ల వ‌సూళ్లు ద‌క్కించుకొంటుంది. అయితే మ‌నం మాత్రం అందుకు చాలా దూరంలో నిల‌బ‌డిపోయింది. 

మ‌నం రీసెంట్‌గా రూ.30 కోట్ల మైలు రాయి దాటింది. చిత్రబృందం మాత్రం మా సినిమా రూ.50 కోట్ల క్లబ్‌లో చేర‌బోతోందోచ్ అంటోంది. కొన్ని లెక్కలు చూపించి ఆ అంకె దాటేసింద‌ని కూడా చెబుతున్నారు. అయితే… మ‌నం సినిమాకి ఆ ఛాన్స్ ద‌క్కడం క‌ష్టమే అని విశ్లేష‌కులు చెబుతున్నారు. లాంగ్ ర‌న్ కోసం ఈసినిమాని నాగ్ చాలా త‌క్కువ ధియేట‌ర్లలో విడుద‌ల చేశాడు. 

దానికి తోడు సీ సెంట‌ర్లలో క‌లెక్షన్లు లేవు. ఈస్ట్‌, వెస్ట్‌, గుంటూరుల‌లో ఈసినిమా వ‌సూళ్లు మ‌రీ నిదానంగా ఉన్నాయి. నైజాం, ఓవ‌ర్సీస్ మాత్రమే మనం సినిమాని ఆదుకొన్నాయి. ఈ ద‌శ‌లో మ‌నం రూ.50 కోట్ల మైలు రాయి చేరుకోవ‌డం చాలా చాలా క‌ష్టం అంటున్నారు మార్కెట్ నిపుణులు. ఈ సినిమా ఎక్కువ సెంట‌ర్లలో ఎక్కువ రోజులు ర‌న్ చేయాల‌న్న ఉద్దేశంతో నాగ్ త‌క్కువ థియేట‌ర్లలో విడుద‌ల చేయ‌డం వ‌ల్ల భారీ మూల్యం చెల్లించుకోవ‌ల‌సి వ‌స్తోంది. ప్చ్‌.. దేవుడు వ‌ర‌మిచ్చినా పూజారి క‌నిక‌రించ‌లేద‌న్నమాట‌.