తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన, వెలుగుతున్న నయనతారకి వయసు మీద పడ్తున్నా అవకాశాలు తగ్గడంలేదు. ఇదివరకట్లా ఎడా పెడా సినిమాలు చేసేయడంలేదుగానీ, చాలా సెలక్టివ్‌గా సినిమాలు చేస్తున్నా.. రెమ్యునరేషన్ విషయంలో మిగతా హీరోయిన్లకన్నా చాలా టాప్‌లో వుంది నయనతార.
అనుష్కలా ‘అరుంధతి’ లాంటి సినిమాలు చేయలేదుగానీ నయనతారకి ఎందుకంత డిమాండ్ పెరిగిపోతోందో ఎవరికీ అర్థం కావడంలేదు. త్రిష విషయానికొస్తే, నయనతారకన్నా పెద్ద విజయాలు త్రిష ఖాతాలో వున్నాయి. కానీ, ఆమెకిప్పుడు అస్సలు డిమాండ్ లేదు. నయనతారతో పోటీ పడి వయసు మీద పడ్తున్నా అవకాశాలు దక్కించుకుంటున్నా అనుష్కకీ, నయనతారకీ తేడా వుంది రెమ్యునరేషన్ పరంగా.
అటు తమిళ హీరోయిన్లకీ, ఇటు తెలుగు హీరోయిన్లకీ నయనకి ఎందుకంత డిమాండ్ అన్నది అర్థం కావడంలేదు. ఓ దశలో సినిమాలకు గుడ్ బై చెప్పేద్దామనుకున్న నయనతార మళ్ళీ సినిమాల్లో బిజీ అయిపోయింది. ఇంకెంతకాలం నయనతారకి ఈ డిమాండ్ వుంటుందోగానీ, తోటి హీరోయిన్లు మాత్రం జెలస్‌గా ఫీలవుతున్నారు ఆమెకున్న డిమాండ్ చూసి.