రుద్రమదేవి..సెప్టెంబర్ నాలుగున విడుదల కావాల్సిన సినిమా. అనివార్య కారణాల వల్ల వాయిదా పడక తప్పలేదు. ఇప్పుడు ఈ వాయిదా కాస్త ఆ సినిమా నిర్మాత గుణశేఖర్, పంపిణీదారుడు దిల్ రాజు నడుమ ఇబ్బంది కర పరిస్థితికి దారి తీసిందని వినికిడి. దీనికి కారణం సెప్టెంబర్ 24ను రుద్రమదేవి విడుదల తేదీగా నిర్ణయించాలని గుణశేఖర్ అనుకోవడమే.
అదే రోజున దిల్ రాజు స్వంత సినిమా సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ వుంది. దాంతో దిల్ రాజు కాస్త కలవరపడ్డాడని వినికిడి. వెళ్లి గుణశేఖర్ తో అదే విషయంపై కాస్త కిందా మీదా పడ్డాడని వినికిడి. 'మీరు 4 అన్నారని ఇరవై రోజులు గ్యాప్ ఇచ్చి 24న ఫిక్స్ చేసా నా సినిమాను. మరి ఇప్పుడు మీరు కూడా 24 అంటే ఎలా?' అని నిలదీసాడని వినికిడి.
కావాలంటే ఒకవారం వెనకగానో, ముందుగానో ప్లాన్ చేయండని అడిగాడట. రుద్రమదేవి బిజినెస్ విషయంలో గుణశేఖర్ కు దిల్ రాజు చాలా సాయం చేసాడని టాక్. అందుకే మరి ఇంకేం అనలేక గుణశేఖర్ రుద్రమదేవిని సెప్టెంబర్ 18 లేదా అక్టోబర్ 2న బరిలోకి దింపాలనుకుంటున్నాడట.