అరవింద్ స్ట్రాటజీ అదుర్స్

అల్లు అరవింద్..పైకి చాలా సైలంట్ గా వుంటారు కానీ స్ట్రాటజీలు భలేగా వుంటాయి. వ్యాపారం చాలా పద్దతిగా, సైలెంట్ గా లాభసాటిగా సాయించాలి అంటే టాలీవుడ్ లో ఆయన తరువాతే. ఎన్నాళ్లుగానో గీతాఆర్ట్స్ సంస్థను…

అల్లు అరవింద్..పైకి చాలా సైలంట్ గా వుంటారు కానీ స్ట్రాటజీలు భలేగా వుంటాయి. వ్యాపారం చాలా పద్దతిగా, సైలెంట్ గా లాభసాటిగా సాయించాలి అంటే టాలీవుడ్ లో ఆయన తరువాతే. ఎన్నాళ్లుగానో గీతాఆర్ట్స్ సంస్థను రన్ చేస్తూ, ఇప్పుడు వున్నట్లుండి గీతా ఆర్ట్ 2 అంటూ కొత్త బ్యానర్ స్టార్ట్ చేసారు. బన్నీ వాసును ప్రొడ్యూసర్ గా ముందుంచారు.

తను స్వంతంగా తీయగలిగి వుండీ, యువి వంటి పెద్ద సంస్థతో టైఅప్ పెట్టుకొని భలే భలే మగాడివోయ్ చిత్రాన్ని నిర్మించారు . ఇప్పుడు ఈ సినిమా గీతాకు, యువికి భలేగా వర్కవుట్ అయిందని వినికిడి. సినిమాకు ఆరేడు కోట్ల వరకు ఖర్చు చేసారు. శాటిలైట్ నే మూడున్నర వరకు వచ్చింది. ఓవర్ సీస్, కృష్ణా, సీడెడ్, నెల్లూరు రైట్లు ఆ మిగతా లోటును దాదాపుగా భర్తీ చేసేసాయి.

ఉత్తరాంధ్ర, గుంటూరు యువి పంపిణీ చేస్తోంది. నైజాం, ఈస్ట్, వెస్ట్ గీతా పంపిణీ చేస్తోంది. అంటే పెట్టుబడి వచ్చేసింది..ఫ్రీగా పంపిణీకి రెండు సంస్థలకు ఏరియాలు మిగిలాయి. వాటిపై వచ్చిన ఆదాయం ఎంతయినా లాభమే. సినిమా కు ఇప్పటికే పాజిటివ్ బజ్ వుంది. రాజమౌళి లాంటివాళ్ల ట్వీట్ లు ఉపయోగపడుతున్నాయి. ఇలా, ఇంత జాగ్రత్తగా ప్లాన్ చేయడం అరవింద్ లాంటి వాళ్ల వల్లే అవుతుంది.