షేక్ అవుతున్న టాలీవుడ్

ఎక్కడి పనులు అక్కడ ఆగిపోతాయి. ఎవరు ఎవరితోనూ మాట్లాడడానికి జంకుతారు. నటులు ఎవ్వరూ నిర్మాతల ఫోన్ లు ఆన్సర్ చేయరు.

తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం ఇయర్లీ టర్నోవర్ ఎంత వుంటుంది? అయిదు వేల కోట్లు? పదివేల కోట్లు? 250 సినిమాలు తీస్తారు అనుకుంటే అందులో 150 సినిమాల బడ్జెట్ కోటి నుంచి రెండు కోట్లు. మిగిలిన యాభై సినిమాల్లో వంద సినిమాల బడ్జెట్ సగటున అయిదారు కోట్లు. మిగిలిన యాభై సినిమాల బడ్జెట్ పది నుంచి వంద కోట్లు. ఈ లెక్కన మొత్తం టర్నోవర్ ఎంత వుంటుంది? రెండు మూడు వేల కోట్లు దాటదు. కానీ అందరి దృష్టి ఈ ఇండస్ట్రీ మీదనే. ఇక్కడేదో నేరాలు..ఘోరాలు జరిగిపోతున్నంత హడావుడి సదా జరుగుతూనే వుంటుంది. ఆర్థిక నేర సామ్రాజ్యం మొత్తం ఇక్కడే వున్నట్లు హడావుడి వుంటూనే వుంటుంది.

ఇప్పుడు ఇన్ కమ్ టాక్స్ దాడులు జరుగుతున్నాయి టాలీవుడ్ మీద. ప్రపంచంలోని నల్లడబ్బు అంతా ఇక్కడే వున్నంత హడావుడి జరుగుతోంది. ఇప్పుడు దీని వల్ల ఏమవుతుంది? ఇప్పుడిప్పుడే నేషనల్ లెవెల్ కు చేరుతున్న ఇండస్ట్రీ ఒక్కసారి చిన్న కదుపునకు లోనవుతుంది. ఎక్కడి పనులు అక్కడ ఆగిపోతాయి. ఎవరు ఎవరితోనూ మాట్లాడడానికి జంకుతారు. నటులు ఎవ్వరూ నిర్మాతల ఫోన్ లు ఆన్సర్ చేయరు.

ఎక్కడ ఏ లింక్ తగిలిందో, తమ జోలికి ఎవరు వస్తారో అని నిర్మాతలు కిందా మీదా అయిపోతూ వుంటారు. ఇది ఒక విషయం.

ఇక రెండో సంగతి. ఇప్పటికే సినిమాలకు అప్పులు ఇచ్చేవారు తగ్గిపోయారు. సినిమాలు స్వంత డబ్బులతో ఎవరూ తీయరు. అంతా ఫైనాన్స్ మీదనే నడుస్తుంది. ఇప్పటికే ఇలా ఫైనాన్స్ ఇచ్చేవారు తగ్గిపోయారు. సత్య రంగయ్య, సుధీర్, అలంకార్ ప్రసాద్ ఇలా రెండు మూడు సిండికేట్ లు మిగిలాయి. ఇలాంటి టైమ్ లో సినిమా ఫైనాన్సియర్ల మీద కూడా దాడులు, సోదాలు మొదలైతే ఇక సినిమాలకు అప్పులు ఇవ్వడానికి జంకుతారు. ఫైనాన్సియర్లు లేకపోతే సినిమాల నిర్మాణమే కుదేలు అవుతుంది.

నిజానికి ఇండస్ట్రీకి బ్యాంకులు అప్పులు ఇవ్వడం అన్నది తక్కువ. మార్టిగేజ్ మీద, ఓడి సదుపాయాల మీద మాత్రమే కాస్త అవకాశం వుంది. ఇటీవల ఓటీటీ అగ్రిమెంట్ల మీద కూడా కాస్త అప్పులు పుడుతున్నాయి. ఇలా అన్ని వైపుల నుంచి తెచ్చుకుంటే తప్ప పని జరగదు. ఇప్పుడు ఈ ఎంట్రీలు అన్నీ పట్టుకుని లింక్‌లు తీసుకుని సోదాలు మొదలు అవుతున్నాయి.

పైగా దాడుల మీద రకరకాల గాలి వార్తలు వినిపిస్తున్నాయి. ఆఫీసుల్లో పని చేసే చాలా కింది స్థాయి అక్కౌంటెంట్లు, క్యాషియర్లను ఇబ్బంది పెడుతున్నారని, వాళ్లు కేవలం పదివేలు, పదిహేను వేల జీతానికి పని చేసే వాళ్లు అని, ఇలా చేస్తుంటే ఇండస్ట్రీలో ఆ పనులు చేయడానికి వచ్చేవాళ్లు కూడా భయపడతారని అంటున్నారు.

మొత్తం మీద అన్ని విధాలుగా ఇండస్ట్రీ షేక్ అవుతోంది.

6 Replies to “షేక్ అవుతున్న టాలీవుడ్”

  1. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

  2. గేమ్ ఛేంజర్ మూవీ ప్రొడ్యూసర్ ఇంట్లో ఐటీ దాడులు చేయడం అన్యాయం.

    పెద్ద బొక్క ఎలా ఉందో వారు తనిఖీ చేస్తున్నారా మరియు రికవరీకి సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నారా?

  3. తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ

Comments are closed.