వర్మకు మూడు నెలల జైలు శిక్ష..!

ప్రముఖ‌ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు బిగ్ షాక్ తగిలింది. ఆయనను ముంబైలోని అంధేరీ మెజిస్ట్రేట్ కోర్టు ఓ చెక్ బౌన్స్ కేసులో దోషిగా తేల్చి మూడు నెలల జైలు శిక్ష విధించింది.

ప్రముఖ‌ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు బిగ్ షాక్ తగిలింది. ఆయనను ముంబైలోని అంధేరీ మెజిస్ట్రేట్ కోర్టు ఓ చెక్ బౌన్స్ కేసులో దోషిగా తేల్చి మూడు నెలల జైలు శిక్ష విధించింది. 2018లో నమోదైన ఈ కేసు గత ఏడు సంవత్సరాలుగా విచారణలో ఉంది. తీర్పు సమయంలో వర్మ కోర్టుకు హాజరుకాలేదు.

దీంతో పాటు కోర్టులో కేసు విచారణ జరుగుతుండగా, వర్మ ఒక్కసారి కూడా కోర్టుకు హాజరుకాక‌పోవ‌డంతో.. ఆగ్రహించిన కోర్టు వర్మపై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. రాబోయే మూడు నెలల్లో ఫిర్యాదు దారుడికి రూ. 3.72 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. లేదంటే మూడు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని మెజిస్ట్రేట్‌ తీర్పు వెల్లడించింది.

కేసు నేపథ్యం.. 2018లో మహేష్ చంద్ర మిశ్రా అనే వ్యక్తి, శ్రీ అనే కంపెనీ తరఫున వర్మపై చెక్ బౌన్స్ కేసు దాఖలు చేశారు. వర్మ కంపెనీకి సంబంధించిన చెక్కు తిరస్కరించబడటంతో ఈ కేసు ప్రారంభమైంది. జూన్ 2022లో వర్మకు రూ. 5000 పూచీకత్తుపై కోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. అప్పటి నుండి విచారణ జరుగుతూ, నేడు న్యాయస్థానం తీర్పు వెలువరించింది.

కాగా, మూడు రోజుల క్రితం దాదాపు 2 దశాబ్దాల తర్వాత తనకు జ్ఞానోదయం అయిందని, ఇకపై ఆర్జీవీ అంటే ఏంటో చూపిస్తానని.. 27 ఏళ్ల తర్వాత తను తీసిన సత్య సినిమాను మరోసారి చూశానని, కన్నీళ్లు వచ్చాయని, అలాంటి సినిమాను తను ఎందుకు బెంచ్ మార్క్ గా పెట్టుకోలేకపోయానని అన్నాడు. నిన్న కూడా సిండికేట్ పేరుతో ఓ సినిమాను ప్ర‌క‌టించారు.

11 Replies to “వర్మకు మూడు నెలల జైలు శిక్ష..!”

  1. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

  2. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

  3. కావాల్సినన్ని స్టోరీస్ రాసుకోవచ్చు ఈ 3 నెలలు జైలు లో కూర్చుని

  4. ఒరేయ్.. జైలు సెల్లో సెల్ఫీ తీసుకుని ఎక్స్ లో పోస్ట్ చేయడం మర్చిపోమాకా.. సూడాలని ఉంది ..

  5. తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ

Comments are closed.