ఐటీ రైడ్స్.. దిల్ రాజు తల్లికి అస్వస్థత!

ప్రముఖ నిర్మాత, తెలంగాణ‌ ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు తల్లి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

ప్రముఖ నిర్మాత, తెలంగాణ‌ ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు తల్లి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన తన ఇంట్లో ఐటీ దాడులు జరుగుతున్న సమయంలో జరిగింది. అస్వస్థతకు గురైన వెంటనే ఐటీ అధికారులు, దిల్ రాజు తల్లిని వారి వాహనంలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ పరిణామం దిల్ రాజు కుటుంబంలో తీవ్ర కలకలం సృష్టించింది.

గత మూడు రోజులుగా దిల్ రాజు ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. సోదాల్లో భాగంగా ఇప్పటికే ఐటీ అధికారులు దిల్ రాజుతో పాటు అతడి భార్యను విచారించడంతో పాటు వారి బ్యాంక్ వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే దిల్ రాజు తల్లి అస్వస్థతకు గురయ్యింది.

ఇప్పటికే ఐటీ దాడులపై దిల్ రాజు స్పందించారు. ఐటీ సోదాలు తన ఒక్కడిపైనే జరుగడం లేదని, ఇండస్ట్రీ మొత్తం సోదాలు కొనసాగుతున్నాయని చెప్పిన విషయం తెలిసిందే. దిల్ రాజుతో పాటు పలువురు సినిమా ప్రముఖుల ఇళ్లపై, సంస్థలపై మూడో రోజూ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ ఐటీ దాడులు ఇంకా ఎన్ని రోజుల పాటు కొనసాగుతాయి అనేది చూడాలి.

11 Replies to “ఐటీ రైడ్స్.. దిల్ రాజు తల్లికి అస్వస్థత!”

  1. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

  2. గేమ్ ఛేంజర్ మూవీ ప్రొడ్యూసర్ ఇంట్లో ఐటీ దాడులు చేయడం అన్యాయం.

    అతని వద్ద పెద్ద బొక్క ఎలా ఉందో వారు తనిఖీ చేస్తున్నారా మరియు రికవరీకి సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నారా?

  3. తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ

Comments are closed.