కుమారి ఆంటీ… రేవంత్ ఇప్పుడు కూడా!

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన దానం నాగేంద‌ర్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన దానం నాగేంద‌ర్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. దానం మాట తీరు చూస్తే, ప్ర‌భుత్వంపై వ్య‌తిరేకంగా ఉన్నార‌న్న అభిప్రాయాన్ని క‌లిగిస్తోంది. తాజాగా దానం నాగేంద‌ర్ మ‌రోసారి మీడియాతో మాట్లాడుతూ అధికారుల‌పై విరుచుకుప‌డ్డారు.

మాదాపూర్‌లో కుమారి ఆంటీకి స‌మ‌స్య రాగానే, ఆమె జోలికి వెళ్లొద్ద‌ని సీఎం రేవంత్‌రెడ్డి అధికారుల్ని హెచ్చ‌రించార‌ని దానం గుర్తు చేశారు. ఇప్పుడు కూడా రేవంత్‌రెడ్డి పుట్‌పాత్ ఆక్ర‌మ‌ణ‌ల తొల‌గింపుల‌పై అధికారుల‌కు అలాంటి ఆదేశాలే ఇవ్వాల‌ని డిమాండ్ చేయ‌డం గ‌మ‌నార్హం. లేదంటే ప్ర‌భుత్వానికి చెడ్డ‌పేరు వ‌స్తుంద‌ని ఆయ‌న అన్నారు.

అధికారులు తామే సుప్రీం అనుకుంటూ ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని విమ‌ర్శించారు. అధికారుల‌కు పూర్తి స్వేచ్ఛ ఇస్తే ప్ర‌భుత్వాలు మ‌నుగ‌డ సాగించ‌లేవ‌ని దానం ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. త‌న‌కు రాజ‌కీయ జ‌న్మ‌నిచ్చింది హైద‌రాబాదే అని ఆయ‌న అన్నారు. అందుకే తాను ప్రాతినిథ్యం వ‌హిస్తున్న ఖైర‌తాబాద్‌కే తాను ప‌రిమితం కాద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. హైద‌రాబాద్‌లో ఎక్క‌డైనా ఎవ‌రికి స‌మ‌స్య వచ్చినా తాను ముందుంటాన‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు.

హైడ్రా చేప‌ట్టిన కూల్చివేత‌ల‌పై తాను మాట్లాడాన‌న్నారు. ఇప్పుడు పుట్‌పాత్‌ల ఆక్ర‌మ‌ణ‌ల‌పై స్పందిస్తున్న‌ట్టు నాగేంద‌ర్ తెలిపారు. పుట్‌పాత్‌ల‌పై పేద ప్ర‌జ‌ల జీవ‌నాధారాల్ని అధికారులు ధ్వంసం చేస్తున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. ఎలాంటి నోటీసులు ఇవ్వ‌కుండా ఆక్ర‌మ‌ణ‌ల పేరుతో తొల‌గించ‌డం ఏంట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. అధికారుల చ‌ర్య‌ల‌తో జ‌నం మ‌ధ్య తాము తిర‌గ‌లేక‌పోతున్న‌ట్టు నాగేంద‌ర్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

6 Replies to “కుమారి ఆంటీ… రేవంత్ ఇప్పుడు కూడా!”

  1. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

  2. Why so we have footpath a in place first. Because of these type of politicians we are like this. If he is worried about people living on foot paths, he need to show them some alternatives or help in other ways. Asalu don’t clean up footpath ante elaa

  3. తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ

  4. అవినీతిపరుడైన దానం నాగేందర్ ప్రజల గురించి మాట్లాడుతున్నట్టు చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయి….

Comments are closed.