ప్రభాస్-మారుతి కాంబినేషన్ రాజా సాబ్ మీద బోలెడు వార్తలు. షూట్ ఇంకా చాలా వుందని. సినిమా ఇప్పట్లో రాదని. రీ షూట్ లు చెప్పారు హీరో అని. ఇంకా చాలా చాలా. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం రాజాసాబ్ కోసం సెప్టెంబర్ లో రెండు డేట్ లు లాక్ చేసారు. ఈ రెండు తేదీల్లో ఏదో ఒకదానికి రాజాసాబ్ విడుదల పక్కా అని తెలుస్తోంది.
రాజాసాబ్ అధిగమించాల్సిన విషయాలు రెండు వున్నాయి, ఒకటి షూటింగ్ వర్క్ పూర్తి చేసుకోవడం. రెండు సిజి పనులు పూర్తి చేసుకోవడం. అయిదు నెలలు గ్యాప్ వుంది కనుక, నెలకు పది రోజులు వర్క్ చేసినా షూట్ వర్క్ అయిపోతుంది. అందులో సందేహం లేదు.
సిజి పనులు పూర్తి కావాలి. అది కూడా ఫుల్ క్వాలిటీతో. అవన్నీ ఆగస్ట్ ప్రారభం నాటికి వచ్చేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారని తెలుస్తోంది. అలా అయితే సెప్టెంబర్ లో విడుదల పెద్ద ఇబ్బంది కాదు.
ఇప్పటికే ఈ సినిమాకు చాలా ఖర్చు అయింది. అవుతోంది. పైగా ఆలస్యం అయిన కొద్దీ పీపుల్స్ మీడియా సంస్థ మీద వడ్డీల భారం పెరిగిపోతుంది.అందువల్ల వీలయినంత త్వరగా అన్నీ పూర్తి చేసి ఈ ఏడాదిలోనే విడుదల చేయాలన్న ప్రయత్నం చేస్తున్నారు. అందుకే సెప్టెంబర్ లో విడుదల ప్లాన్ చేస్తున్నారు. టీజర్ విడుదల ఏప్రిల్ లో వుండొచ్చు.
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
Waiting