హవ్వ! అత్యుత్సాహం ఆపుకోలేని సీఐడీ!

సిఐడి పోలీసులు అయినంత మాత్రాన అలాంటి చిన్నచిన్న ముచ్చట్లకు తాము అతీతం కాదని వారు నిరూపించారు.

వెనకటికి ఒక జర్నలిస్టు గురించిన చిన్న కథ చెప్పుకోవాలి. అనగనగా ఒక ఊళ్లో ఒక ప్రసిద్ధి పొందిన స్వామీజీ గురించి అనేక దుష్ప్రచారాలు వచ్చాయి. ఆయన ఫలానా ఫలానా తప్పుడు పనులు చేస్తున్నారని, అరాచకాలకు పాల్పడుతున్నారని అనేక వ్యవహారాలు ప్రచారం కాసాగాయి. నోరు తెరిచి వివరణ ఇవ్వకపోతే ఈ ప్రచారాలే నిజమని అందరూ అనుకునే ప్రమాదం కూడా ఉన్నదని సదరు స్వామీజీ కూడా గుర్తించారు.

సాధారణంగా ఆ స్వామీజీని వ్యక్తిగతంగా కలిసే అపాయింట్మెంట్ కూడా సామాన్యులకు దుర్లభమైన సంగతి. అంతటి వీఐపీ స్వామీజీ చివరకు పూనుకుని ఒక విలేకరుల సమావేశం నిర్వహించారు. విలేకరులు వచ్చారు.. వారంతా స్వామీజీ కి నమస్కారాలు చేస్తూ ఆయన చెప్పింది విని నోట్ చేసుకు వెళ్లడమే తమ బాధ్యత అన్నట్టుగా భక్తి ప్రపత్తులు ప్రదర్శించారు.

ఒక విలేకరి మాత్రం ఆ స్వామీజీని నానా చిక్కు ప్రశ్నలు వేసి యాతన పెట్టారు. ప్రెస్ మీట్ ముగిసిన తర్వాత అందరూ బయటకు వెళ్ళాక సదరు విలేకరి మళ్ళీ లోపలికి వచ్చి, స్వామీజీ పాదాల మీద సాగిలపడి, పాదాలు ముట్టుకుని నమస్కారాలు చేసి ఆయన పాద ధోని నుదుట విభూదిలా పులుముకుని ‘స్వామీ క్షమించండి’ అని అడిగాడు. నన్ను ఆశీర్వదించండి అని వేడుకున్నాడు. ‘ఇదేమి చిత్రం రా బాబు’ అని స్వామీజీ ఆశ్చర్యపోతుంటే.. ‘ఏదో విలేకరిగా నా విధి గనుక మిమ్మల్ని ప్రశ్నలు అడిగాను- మీరంటే నాకు అలవిమాలిన భక్తి’ అంటూ వెల్లడించుకున్నాడు.

ఈ కథ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. ఏపీ సిఐడి పోలీసుల పరిస్థితి ఇంతకంటే భిన్నంగా ఏమీ లేదు. తాము రిమాండ్ లో ఉన్న ఒక ఖైదీని విచారణ నిమిత్తం కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకుని ప్రశ్నిస్తున్నామని వారికి తెలుసు. తమ పాత్ర కత్తి మీద సాము వంటిదని, అతని నుంచి వాస్తవాలు రాబట్టడమే తమ విధి అని కూడా వారికి తెలుసు. ఇలాంటి విధులలో ఉన్నప్పుడు వ్యక్తిగత అభిమాన దురభిమానాలను అదుపులో ఉంచుకోవాలనే సంగతి మాత్రం వారికి తెలిసినట్లు లేదు. అందుకే అసభ్య పోస్టుల కేసులో రిమాండులో ఉంటూ కస్టోడియల్ విచారణకు వచ్చిన సినిమా నటుడు పోసాని కృష్ణమురళిని తిరిగి జైలు వద్ద దిగబెడుతూ ఆయనతో కలిసి ఫోటోలు దిగడానికి సిఐడి పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు.

విచారణకు పిలిచిన ఖైదీలతో మసలవలసిన విధివిధానాలను వారు విస్మరించారు. సినీ నటులతో ఫోటోలు దిగి దాచుకోవాలని డిపిలుగా పెట్టుకోవాలని, సోషల్ మీడియాలో పంచుకోవాలనే ముచ్చట చాలామందికి ఉంటుంది. సిఐడి పోలీసులు అయినంత మాత్రాన అలాంటి చిన్నచిన్న ముచ్చట్లకు తాము అతీతం కాదని వారు నిరూపించారు. అందుకే ఇప్పుడు నవ్వులపాలవుతున్నారు.

8 Replies to “హవ్వ! అత్యుత్సాహం ఆపుకోలేని సీఐడీ!”

  1. అంటె CID దురుసుగా ప్రవర్తించటం లెదు, జగన్ హయాములొలా RRR కి ఇచ్చిన ట్రెట్మెంట్ ఇవ్వాలి కాని అంటావా?

  2. పోసానిని కుమ్మించేదాకా వదిలే లా లేరే???? పోసానికి b@Il వస్తే అందరు వైసీపీ లీగల్ టీం మీద పడతారు అని కావాలని మన అన్నే …బాధితులే సొంత లాయర్ లని పెట్టుకునే లా….చేస్తున్నారు అని పేరు చెప్పడానికి ఇష్టపడని వైకాపా నాయకులూ ఆఫ్ ది రికార్డు ది చెప్పిన మాటలు మీ వారు రాలేదా ??!!

  3. ఆహా… ఎంత దిక్కు మాలిన అవినీతి elevation… వందల కోట్ల ప్రజల సొమ్ము దోచుకున్న వాడికి అభిమానులు….🙏🙏🙏 ఇంతకీ అసలు press meets అంటేనే భయపడి చచ్చే ఆ వేల కోట్ల అవినీతి స్వామిజి యెవరు GA….😂😂

Comments are closed.