ప్రభుత్వ ఉద్యోగాలు చాలు బాబోయ్​.. !

ఏడాదికి రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలంటే మాటలా?

వెనకటికి ఒకడిని బొంకరా బొంకారా అంటే మా ఊరి మిరియాలు తాటికాయలంత అన్నాడట. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాటలు అలాగే ఉన్నాయి. కేసీఆర్​ ప్రభుత్వం కంటే తమది గొప్ప ప్రభుత్వమని చెప్పకోవడానికి నానా తంటాలు పడుతోంది. గొప్ప పనులు చేస్తే వాటిని చెప్పుకోవచ్చు. తప్పు లేదు. కాని అతిశయోక్తులు, అబద్ధాలు మాట్లాడకూడదు కదా.

అందులోనూ డిప్యూటీ సీఎం ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో అతిశయోక్తులు మాట్లాడితే ఎలా ఉంటుంది? ప్రతిపక్షాలకు మరో ఆయుధం అందించినట్లే కదా. రాజీవ్​ యువ వికాసం అనే కార్యక్రమంలో మాట్లాడుతూ భట్టి ఏమన్నాడు? నిరుద్యోగులు ఒకప్పుడు  అంటే బీఆర్​ఎస్​ పాలనలో ప్రభుత్వ ఉద్యోగాలు కావాలని ధర్నాలు చేశారట.

కాని ఇప్పుడు అంటే కాంగ్రెసు పాలనలో నోటిఫికేషన్లు పెద్ద ఎత్తున వస్తుండటంతో కొద్దిగా గ్యాప్​ ఇవ్వండని నిరుద్యోగులు వేడుకుంటున్నారట. అంటే తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కువైపోయాయని భట్టి ఊవాచ. నిరుద్యోగులు ఇక వద్దనే స్థాయికి ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చిందని భట్టి చెప్పాడు. కాని నిజంగా పరిస్థితి ఇంత గొప్పగా ఉందా? అంటే లేదనే చెప్పొచ్చు.

కాంగ్రెసు ప్రభుత్వం ఏర్పడి ఇంకా రెండేళ్లు కూడా పూర్తి కాలేదు. ఇంత కొద్ది కాలంలో నిరుద్యోగులకు విసుగు పుట్టేటన్ని నోటిఫికేషన్లను ప్రభుత్వం ఇచ్చిందా? అసలు వివిధ కారణాలతో ప్రభుత్వం ఏడాదిగా ఒక్క జాబ్ నోటిఫికేషన్​ కూడా ఇవ్వలేదు. వాస్తవం ఇలా ఉంటే భట్టి మాత్రం కుప్పలు తెప్పలుగా నోటిఫికేషన్లు ఇచ్చినట్లు పబ్లిగ్గా చెప్పాడు. నిరుద్యోగులు జాబ్​ క్యాలెండర్​ విడుదల చేయాలని కోరుతుంటే భట్టి మాత్రం నోటిఫికేషన్లే వద్దంటున్నారని చెబుతున్నాడు.

ఎన్నికల సమయంలో ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెసు పార్టీ హామీ ఇచ్చింది. అసలు ఇంత పెద్ద హామీ ఎలా ఇచ్చిందో అర్థం కాదు. ఏడాదికి రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలంటే మాటలా? వాస్తవానికి లక్ష ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. ఇప్పటివరకు 57 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చినట్లు ప్రభుత్వమే చెబుతోంది. మరి కుప్పలు తెప్పలుగా ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చినట్లు?

గ్రూప్​ వన్​ నోటిఫికేషన్​ ఇస్తామని ప్రభుత్వం గత ఏడాది చెప్పింది. కాని ఇప్పటివరకు ఇవ్వలేదని బీఆర్​ఎస్​ ఆరోపిస్తోంది. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన రేవంత్​ ప్రభుత్వం ఆ పని చేయలేదుగాని ఉద్యోగాల విషయంలో ప్రధాని మోదీని విమర్శిస్తారు.

2014, 2019 ఎన్నికల ప్రచారంలో ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రధాని చెప్పారు. ఆ లెక్కన 24 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. తెలంగాణలో రెండు ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు. ఒకటి కిషన్‌రెడ్డికి.. మరొకటి బండి సంజయ్‌కు. వీరికి కాకుండా ఇంకెవరికైనా ఇచ్చారా? అంటూ ఎప్పుడూ విమర్శిస్తారు. మొత్తం మీద భట్టి విక్రమార్క రేవంత్​ రెడ్డి సర్కారుకు డ్యామేజ్​ చేశాడని అనుకోవాలా?

5 Replies to “ప్రభుత్వ ఉద్యోగాలు చాలు బాబోయ్​.. !”

  1. ముక్కోడు పరిపాలన కాలంలో కవిత లిక్కర్ వ్యాపారం చేసేది, కేటీఆర్ డ్రగ్స్ అమ్ముకునే వాడు,హీరోయిన్స్ తో ఫార్మ్ హౌస్ లో రేవ్ పార్టీ లు చేసేవాడు , ముక్కోడు ధరణి పోర్టల్ లో భూములు అమ్మేశాడు , హరీష్ రావు గొర్రెల స్కాం ఇలా ఆ నలుగురు మాత్రమే బాగుపడ్డారు దానితో పోలిస్తే చాలా బెటర్

Comments are closed.