పోసాని ఏ మేరకు సేఫ్?

పోసానిపై మిగతా కేసులు ఇంకా అలానే ఉన్నాయి. వాటి వల్ల అరెస్ట్ కాకుండా ముందస్తుగానే బెయిల్ కోరుతూ ఆయన హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది.

ఎట్టకేలకు పోసాని కృష్ణమురళి జైలు నుంచి బయటకొస్తున్నారు. పలు కేసులకు సంబంధించి అరెస్టైన ఆయన, ఆ కేసుల నుంచి బెయిల్ పొందారు. ఇక పోసానికి ఏం కాదా? ఆయన అందరిలా ఫ్రీగా ఉండొచ్చా?

భవిష్యత్తులో ఇది మాత్రం సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే, ఆంధ్రప్రదేశ్ లో ఆయనపై 18 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం బెయిల్ వచ్చింది కొన్ని కేసులపై మాత్రమే. మిగతా కేసులపై పోలీసులు ఇంకా ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. కాబట్టి ఏ నిమిషంలోనైనా మరోసారి పోలీసులు, పోసాని ఇంటి తలుపు తట్టొచ్చు. ఇక ఆ తర్వాత పీటీ వారెంట్స్ సంగతి అందరికీ తెలిసిందే.

గత నెల 26వ తేదీన ఓ కేసులో పోసానిని అదుపులోకి తీసుకున్నారు ఏపీ పోలీసులు. ఆ కేసుకు సంబంధించి విచారణ, బెయిల్ ప్రాసెస్ జరుగుతున్న టైమ్ లోనే, మరికొన్ని కేసులు తెరపైకొచ్చాయి. బెయిల్ రూపంలో ఒక్కొక్కటిగా క్లియర్ చేసుకుంటూ వచ్చారు పోసాని.

ఆల్ సెట్.. ఇక జైలు నుంచి బయటకు రావడమే ఆలస్యం అనుకున్న టైమ్ లో సీఐడీ రంగంలోకి దిగింది. మరుసటి రోజు రిలీజ్ అవుతారనగా, పీటీ వారెంట్ వేసి పోసానిని అదుపులోకి తీసుకొని గుంటూరు జైళ్లో పెట్టింది. కోర్టు ఒక రోజు కస్టడీకి కూడా అనుమతించింది.

దీంతో పోసాని కష్టాలు మళ్లీ మొదలయ్యాయని అంతా అనుకున్నారు. బుధవారం రోజు పోసానికి బెయిల్ వస్తుందని అంతా భావించారు. కానీ కేసు వాయిదా పడింది. ఈరోజు పోసానికి బెయిల్ వచ్చింది.

పోసానిపై మిగతా కేసులు ఇంకా అలానే ఉన్నాయి. వాటి వల్ల అరెస్ట్ కాకుండా ముందస్తుగానే బెయిల్ కోరుతూ ఆయన హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. ఆ తర్వాత మాత్రమే ఆయన కాస్త ఊపిరి పీల్చుకోవచ్చు.

8 Replies to “పోసాని ఏ మేరకు సేఫ్?”

  1. కావలిసిన ఇన్ఫర్మేషన్ పిండుకొన్నారు.. ఇక బెయిల్ ఇచ్చేసి బయటకు తోలేస్తున్నారు..

    సమయం చూసుకుని.. ఆ ఇన్ఫర్మేషన్ తో పెద్ద తలకాయల్ని రెడ్ బుక్ చేసుకొంటారు..

    ..

    అక్కడ కొడాలి , రోజక్క “సిద్ధం” గా ఉన్నారు.. ఈ స్టాఫ్ ని వాళ్లకు అసైన్ చేసుకొంటారు..

    ఒక ప్లానింగ్.. ఒక పద్ధతి.. ఒక విసన్ .. అదన్నమాట..

  2. అన్న చేతిలో పడ్డాకా సేఫ్ అంటూ ఏమి లేదు…తల్లి, చెల్లి, బాబాయ్, పోసాని ఎవరైనా డేంజర్ జోన్ లోనే

Comments are closed.