పాటలు.. భంగిమలు.. మహిళలు

హీరోయిన్ల పిరుదులను తాకించడం కొట్టడం, బొడ్డు కింద డ్రెస్ ల్లో చేతులు పెట్టడం, హీరో ఒళ్లో హీరోయిన్లు కూర్చో పెట్టడం, ఇలా ఒకటి కాదు, రెండు కాదు ఈ వికృత భంగిమల పరంపర.

తెలుగు సినిమాలలోని పాటల్లో మహిళల విషయంలో అవమానకర, అసభ్యకరమైన భంగిమలు వుంటున్నాయని, ఇలాంటివి సరి కాదని, తెలంగాణ మహిళా కమిషన్ హెచ్చరించింది. ఇప్పటికైనా మహిళా కమిషన్ ఈ విషయం మీద దృష్టి పెట్టడం చాలా అంటే చాలా గొప్ప విషయం.

సినిమాలో మామూలు పాటలు ఎలా వున్నా, ఐటమ్ లేదా స్పెషల్ సాంగ్ పేరిట చాలా అంటే చాలా అసభ్యంగా చిత్రీకరణలు వుంటున్నాయన్నది అందరికీ తెలిసిందే. అయితే సినిమాల్లో ఇది కొత్తగా పుట్టిన సంప్రదాయం కాదు. పాత సినిమాల్లో లేలేలే నారాజా, గు..గు..గుడిసుంది దగ్గర నుంచి ఇప్పటి ఇదిదా సర్ప్రయిజ్ వరకు అలవాటుగా మారింది. అయితే ఈ అలవాటు మరింత శృతి మించి డ్యూయట్ ల్లోకి కూడా చేరింది. వయసు మీద పడిన సీనియర్ హీరోలు కూడా హీరోయిన్ల బొడ్డు ముందు డ్రెస్ లో చేయి లోపల పెట్టే వరకు వె్లిపోయింది.

మిస్టర్ బచ్చన్, డాకూ మహరాజ్ ల్లో సీనియర్ల హీరోల చేత డ్యాన్స్ మాస్టర్ చేయించిన వికృత చర్యలు ఇన్నీ అన్నీ కావు. పుష్ప 2 లో పీలింగ్స్ పాటలో బన్నీ-రష్మిక చూపించిన భంగిమలు మహిళాకమిషన్ ప్రత్యేకంగా ఒకసారి చూడాలి. గమ్మత్తేమిటంటే ఈ వికృత గీతాలు అన్నీ వైరల్ కావడం. ఇన్ స్టా జనాలు ఎవరికి వారు ఇవే స్టెప్ లు వేయడం వీడియోలు పెట్టడం అన్నది కామన్ అయిపోయింది. అదే సినిమాలకు బజ్ తెస్తోంది. ఓపెనింగ్ తెస్తోంది అని టాలీవుడ్ జనాలు నమ్ముతున్నారు. అందుకే మరింత వైరల్ స్టెప్ లు కంపోజ్ చేయిస్తున్నారు.

దాంతో రాను రాను మరింత వికృతంగా తయారవుతున్నాయి. హీరోయిన్ల పిరుదులను తాకించడం కొట్టడం, బొడ్డు కింద డ్రెస్ ల్లో చేతులు పెట్టడం, హీరో ఒళ్లో హీరోయిన్లు కూర్చో పెట్టడం, ఇలా ఒకటి కాదు, రెండు కాదు ఈ వికృత భంగిమల పరంపర. దీనికి తోడు డ్రెస్ లు కూడా అలాంటివే. వీలయినంత చిట్టి పొట్టి డ్రెస్ లు కట్టపెట్టడం కామన్ అయిపోయింది. త్రివిక్రమ్ లాంటి మేధావి దర్శకులు హీరోయిన్ కాళ్లు చూపిస్తూ, సినిమాను హిట్ చేసుకున్న సంగతులు వున్నాయి.

ఓటిటి మీద దృష్టి పెట్టాలి

ఈ మహిళా కమిషన్లు ఓటిటి కంటెంట్ మీద కూడా దృష్టి పెట్టాలి. ఓటిటిల్లో అస్సలు చూడలేని, వాంతి వచ్చేలాంటి సీన్లు అన్నీ వుంటున్నాయి. దారుణమైన బెడ్ రూమ్ సీన్లు అన్నీ తెరమీదకు తెస్తున్నారు. వికృత శృంగారాన్ని చూపించి, జనాలను తప్పు దారి పట్టిస్తున్నారు. ఒక్కసారి కనుక ఎవరో ఒకరు ఈ సమస్యను లేవనెత్తాలి. అప్పుడు మిగిలిన వారు కూడా అందుకుంటారు. ఫలితం ఎంతో కొంత వుంటుంది.

16 Replies to “పాటలు.. భంగిమలు.. మహిళలు”

  1. ఆ చెత్తని కంపోజ్ చేసిన డాన్స్ డైరెక్టర్లతో పాటు డాన్స్ చేసినోళ్లని కూడా లోపలెయ్యాలి. శిక్షలు పడకపోయినా కొన్నాళ్ళు కోర్టులు చుట్టూ తిరిగితే మిగతా వాళ్ళకైనా సిగ్గొస్తుంది

  2. అవి అత్యంత ప్రజాదరణ పొంది వందల కోట్ల కలెక్షన్ కొల్లగొట్టిన సినిమాలు అవి మీరు చెప్పేది ఆ చూసిన జనాలు పనికి మాలినోళ్లనా కాలాన్ని బట్టి సెన్సార్షిప్ ఉంటది మీకు ఇష్టంలేకపోతే మానెయ్యడమే ఏ పదవి అయినా లంచాల కోసం ఏడుస్తున్నారు ఎదో వార్నింగ్ ఇచ్చినట్టు నటనలు సాయంకాలం ఇంటికెళ్లి వసూళ్లు చేసుకోవడం సెన్సార్ బోర్డు ఉండగా ఈమెకి సంబంధం ఏమిటి కుక్కపని గాడిద చేసినట్టు

Comments are closed.