యథా జ‌గ‌న్‌.. త‌థా సాక్షి!

వైసీపీ, జ‌గ‌న్ దుర‌దృష్టం కొద్దీ ప‌రిశోధ‌నాత్మ‌క జ‌ర్న‌లిజాన్ని సాక్షి మీడియా మ‌రిచిపోయిన‌ట్టుంది.

యథారాజా తథా ప్రజా అని అంటారు. ఈ మాటకు అర్థం రాజు ఎలా న‌డుచుకుంటారో, ప్ర‌జ‌లు కూడా ఆయ‌న్నే అనుస‌రిస్తార‌ని. య‌జ‌మాని తీరును అనుస‌రించి ఉద్యోగులు వ్య‌వ‌హ‌రిస్తుంటారు. య‌థా వైఎస్ జ‌గ‌న్‌…త‌థా సాక్షి మీడియా అనే మాట వినిపిస్తోంది. ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తే త‌ప్ప‌, అసెంబ్లీ స‌మావేశాల‌కు వెళ్ల‌న‌ని జ‌గ‌న్ ఎంత బాధ్య‌తారాహిత్యంతో వ్య‌వ‌హ‌రిస్తున్నారో, బ‌హుశా ఆయ‌న్ను ఆద‌ర్శంగా తీసుకుని సాక్షి మీడియా కూడా య‌జ‌మాని బాట‌లో న‌డుస్తోంద‌న్న విమ‌ర్శ వెల్లువెత్తుతోంది.

కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి.. ఈ ప‌ది నెల‌ల్లో వైసీపీకి, వైఎస్ జ‌గ‌న్‌కు రాజ‌కీయంగా ప‌నికొచ్చే ఒక్క‌టంటే ఒక్క ప‌రిశోధ‌నాత్మ‌క క‌థ‌నాన్ని సాక్షి ప‌త్రిక రాసిన పాపాన పోలేదు. దీనికి సాక్షి పాత్రికేయుల్ని త‌ప్పు ప‌ట్టాలో, లేదో కూడా అర్థం కాని ప‌రిస్థితి. జ‌గ‌న్ నిత్యం దుష్ట‌ప‌త్రిక‌గా తిట్టిపోసే ఆంధ్ర‌జ్యోతి ప‌త్రికే, ఇవాళ వైసీపీకి రాజ‌కీయంగా ప‌నికొచ్చే క‌థ‌నాల్ని రాస్తోంది. ఈ మాట వైసీపీ నేత‌లే అంటున్నారు.

తిరుప‌తిలో తొక్కిస‌లాట సంద‌ర్భంలో సీఎం చంద్ర‌బాబు స‌మ‌క్షంలోనే టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామ‌లారావు ప‌ర‌స్ప‌రం నువ్వెంత అంటే నువ్వెంత అని తిట్టుకోవ‌డం మొద‌లుకుని, తాజాగా స్థ‌ల క్ర‌మబ‌ద్ధీక‌ర‌ణ విష‌య‌మై దేవాల‌యం లాంటి అసెంబ్లీ ప్రాంగ‌ణంలోనే అధికారుల‌పై విజ‌య‌వాడ‌కు చెందిన ఎమ్మెల్యే తిట్ల దండ‌కం వ‌ర‌కూ ఆంధ్ర‌జ్యోతి ప‌త్రికే రాసింది.

అలాగే ఐఏఏస్ భార్య‌ల అవినీతిపై క‌థ‌నం, కూట‌మి ఎమ్మెల్యేలు రాష్ట్ర వ్యాప్తంగా భూదందాలు, మ‌ట్టి, గ్రావెల్ అక్ర‌మ త‌వ్వ‌కాలు, మ‌ద్యం వ్యాపారాల్లో సిండికేట్ల గురించి రాసింది కూడా ఆ దుష్ట‌ప‌త్రికే. రామాయ‌ప‌ట్నంలో కందుకూరు ఎమ్మెల్యే దందాగిరి, అలాగే ఇటీవ‌ల ఎక్సైజ్ క‌మిష‌న‌ర్ కార్యాల‌యంలో న‌ర‌సారావుపేట ఎమ్మెల్యే ర‌చ్చ‌… ఇలా ఒక్క‌టేమిటి, అనేక సంచ‌ల‌న క‌థ‌నాల్ని, జ‌గ‌న్‌కు రాజ‌కీయంగా ప‌నికొచ్చే అంశాల్ని వెలికి తీసింది ఆంధ్ర‌జ్యోతి ప‌త్రికే.

నిజానికి ఇలాంటి కథ‌నాల్ని రాయాల్సింది సాక్షి మీడియా. కానీ వైసీపీ, జ‌గ‌న్ దుర‌దృష్టం కొద్దీ ప‌రిశోధ‌నాత్మ‌క జ‌ర్న‌లిజాన్ని సాక్షి మీడియా మ‌రిచిపోయిన‌ట్టుంది. జ‌గ‌న్ పాలిట సాక్షి తెల్ల ఏనుగులా మారింద‌న్న విమ‌ర్శ లేక‌పోలేదు. వైసీపీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న నేప‌థ్యంలో కూట‌మి ప్ర‌భుత్వ అవినీతిని, ప్ర‌జాప్ర‌తినిధుల అరాచ‌కాల్ని ఎన్నైనా వెలికి తీయొచ్చు. కానీ ఆ ప‌ని చేయ‌డంలేదు.

ఎంత‌సేపు వైఎస్ జ‌గ‌న్ పాల‌న‌ను పొగుడుతూ క‌థ‌నాలు రాయ‌డం, అలాగే కూట‌మి స‌ర్కార్ సంక్షేమ ప‌థ‌కాల్ని అమ‌లు చేయ‌లేద‌ని విమ‌ర్శిస్తూ తోచిన రీతిలో అక్ష‌రీక‌రించ‌డం. ఈ ప‌ని చేస్తే చాలు జ‌గ‌న్‌ను సంతృప్తిప‌ర‌చొచ్చ‌ని సాక్షి టీమ్ భావిస్తున్న‌ట్టుంది.

సాక్షి ఎడిట‌ర్‌గా ధనుంజ‌య్‌రెడ్డి కొంత‌కాలం క్రితం బాధ్య‌త‌లు తీసుకున్నారు. జ‌గ‌న్ అధికారంలో ఉన్న‌ప్పుడు ఈయ‌న‌గారు ప్ర‌భుత్వంలో స‌ల‌హాదారుడు. ప్ర‌భుత్వం పోయిన వెంట‌నే… సాక్షిలోకి జంప్‌. వీళ్ల‌ను చూస్తే ఏమ‌నిపిస్తుందంటే… ఎడిట‌ర్ ఉద్యోగం కావాలే త‌ప్ప‌, సాక్షిని ఉద్ధ‌రించ‌డం త‌మ ప‌ని కాద‌న్న‌ట్టుగా వుంది. జ‌ర్న‌లిజం అంటే య‌జ్ఞం లాంటిది. మ‌రీ ముఖ్యంగా ప్ర‌తిప‌క్షంలో ఉన్న రాజ‌కీయ పార్టీ కోసం ప‌ని చేసే మీడియాకు చాలా బాధ్య‌త‌లు వుంటాయి. అలాగే ప్ర‌భుత్వ వ్య‌తిరేక విధానాల్ని, అవినీతిని, కూట‌మి నేత‌ల అరాచ‌కాల్ని వెలుగులోకి తీసుకొచ్చేందుకు అవ‌కాశాలు పుష్క‌లం.

కానీ ప్ర‌తిప‌క్ష పార్టీ త‌ర‌పున ప‌నిచేసే జ‌ర్న‌లిస్టుల‌కు కావాల్సింద‌ల్లా …జ‌ర్న‌లిజం స్పృహ‌, స‌మాజం ప‌ట్ల బాధ్య‌త‌. ఏమైనా అంటే ఏడుస్తారు గానీ, తాము రాయాల్సిన ప‌రిశోధ‌నాత్మ‌క క‌థ‌నాల్ని, ప్ర‌త్య‌ర్థి పార్టీకి చెందిన ప‌త్రిక రాస్తుంటే… క‌నీసం సిగ్గుగా అనిపించ‌డం లేదా? అని ప‌క్క‌న వాళ్లు అడ‌గ‌క ముందే, త‌మ‌ను తాము ప్ర‌శ్నించుకుంటే మంచిది.

29 Replies to “యథా జ‌గ‌న్‌.. త‌థా సాక్షి!”

  1. “తప్పుడు సాక్షి” తుడుచుకోవడానికే కానీ చదువుకోవడానికి కాదు.. అని 2021లో మావోడే సాక్ష్యత్తు అసెంబ్లీలోనే ముఖ్యమంత్రి హోదా లో డిక్లేర్ చేసాడు..

    All Y Sheeps stop reading సాక్షి.. Start reading ఆంధ్రజ్యోతి n ఈనాడు

  2. ఇంత అవకాశం ఇచ్చిన ఆంధ్ర జ్యోతి ని దుష్ట పత్రిక అంటున్నావు. నీది నోరా లేక ఇంకా ఏదన్నా?

    నేనే

  3. సమర్దిస్తున్న పార్టీ లో చేస్తున్న తప్పలు ఎత్తి చూపేది దుష్ట పత్రిక… అదే సమర్దిస్తున్న పార్టీ తప్పు చేసిన కూడా బాకా ఊడటం న్యూట్రల్ జెర్నలిజం

  4. నేను మొన్న c@ment లో ఇదే రాసా…ఇవ్వాళ మీరు ఆర్టికల్ రాసారు…. సూపర్ రా babu

  5. Chuutu neelaanti verri pushpalni pettukunnadu gatha 5 samvathsaraalu…..ippudu okksaarigaa joolu vidhilinchi parisodhanathmaka kadhnaalu raayamante yelaa cheppu.

  6. సాక్షి చేయలేని పనిని నువ్వు చేస్తున్నావు కదా రా గ్యాస్ ఆంధ్ర. ఇక దాని తోకలు అంటే సాక్షి తోకలు టీవీ9 ఎన్ టీవీ టెన్కు టీవీ మిగిలిన వారు తమకు చేతనయినంతగా సహాయం చేస్తూనే ఉన్నాయి కదరా గ్యాస్ ఆంధ్ర.. ఎందుకంటే సాక్షి పత్రికను మీడియాను ఎవరు నమ్మరు. వాళ్లు ఏమి రాసిన అంత గ్యాస్ అంటారు జనాలు. నీది గ్రేట్ ఆంధ్ర పోయి గ్యాస్ ఆంధ్ర ఎలా అయిందో అలా

  7. That is how media supposed to work. Eenadu, ABN, etc.. are doing watchdog duty on government and ruling party. They don’t want to go any mistakes uncovered. AP cannot afford one more Jagan’s term.

      1. కూటమిలో ఒకరిద్దరు MLA లు అరాచకం చేస్తున్నారేమో కానీ గత వైసీపీ ప్రభుత్వమే అరాచకం చేసింది. అదీ తేడా..

Comments are closed.