ప‌వ‌న్‌ను ‘కాపు’ కాస్తే స‌రా?.. టీడీపీ కాపుల గుస్సా!

చంద్ర‌బాబు మాత్రం ఇద్ద‌రు కాపుల‌కు మాత్ర‌మే మంత్రి ప‌ద‌వులు ఇచ్చారు. దీన్నిబ‌ట్టి కాపుల‌కు చంద్ర‌బాబు ఆలోచ‌న విధానం ఏంటో అర్థం చేసుకోవ‌చ్చు.

శివ‌పార్వ‌తులు త‌మ కుమారులైన కుమార‌స్వామి, వినాయ‌కుడిని పిలుచుకుని …లోకాన్ని తిరిగి రావాల‌ని ఆదేశించార‌ట‌. కుమార‌స్వామి లోకాన్ని చుట్టేసేందుకు బ‌య‌ల్దేరారు. కానీ వినాయ‌కుడు మాత్రం త‌ల్లిదండ్రులైన శివ‌పార్వ‌తుల చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లు చేశార‌ట‌. ఇది పురాణాల్లో ఉన్న క‌థ‌. త‌న త‌ల్లిదండ్రులే లోక‌మ‌ని గ్ర‌హించిన వినాయ‌కుడు, వాళ్ల చుట్టూ తిరిగి. సూక్ష్మంలో మోక్షం వుంద‌ని గ్ర‌హించిన తెలివైన వాడిగా గుర్తింపు పొందారు.

ఇప్పుడీ క‌థ ఎందుకంటే.. టీడీపీలో కాపులు త‌మ‌కు క‌నీస గుర్తింపు, గౌర‌వం లేద‌ని తీవ్ర ఆవేద‌న చెంద‌డాన్ని చెప్పుకోడానికి. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కాపులు బ‌ల‌మైన ఓటు బ్యాంక్ క‌లిగిన సామాజిక వ‌ర్గం. కోస్తాలో కాపులు, రాయ‌ల‌సీమ‌లో బ‌లిజ‌ల‌ని వాళ్ల‌ను పిలుస్తారు. గ‌త ఎన్నిక‌ల్లో కూట‌మికి ఆ సామాజిక వ‌ర్గం అండ‌గా నిలిచింది. కాపు, బ‌లిజల ఓట్ల కోస‌మే జ‌న‌సేన‌తో చంద్ర‌బాబు పొత్తు పెట్టుకున్నార‌నేది వాస్త‌వం.

జ‌న‌సేన‌ను త‌మ సొంత పార్టీగా కాపు, బ‌లిజ‌లు న‌మ్ముతున్నారు. అందుకే ప్ర‌త్యేకంగా కాపుల‌కు తాను ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవ‌స‌రం లేద‌ని గ్ర‌హించిన చంద్ర‌బాబునాయుడు తెలివిగా వ్య‌వ‌హ‌రించారు. జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను మ‌చ్చిక చేసుకుంటే చాలు, కాపులంతా త‌మ వెంట వుంటార‌నే ఆయ‌న వ్యూహ‌మే ఫ‌లించింది. కాపుల‌కు ప‌వ‌న్ విప‌రీత ప్రాధాన్యం ఇస్తున్నారు.

జ‌న‌సేన‌కు 21 అసెంబ్లీ , రెండు పార్ల‌మెంట్ సీట్లు పొత్తులో భాగంగా చంద్ర‌బాబు కేటాయించారు. వీటిలో సగం అసెంబ్లీ సీట్ల‌ను త‌న సామాజిక వ‌ర్గానికే ఇచ్చారు. ఒక‌ట్రెండు ఎస్సీ రిజ‌ర్వ్‌డ్ సీట్లు. ఇక రెండు లోక్‌స‌భ స్థానాల్ని త‌న సామాజిక వ‌ర్గానికే కేటాయించుకున్నారు. అలాగే కేబినెట్‌లో జ‌న‌సేన‌కు మూడు బెర్త్‌లు ద‌క్కితే, అందులో రెండు కాపులు, ఒక‌టి క‌మ్మ సామాజిక వ‌ర్గానికి ద‌క్కాయి. ఇప్పుడు నాగ‌బాబును కూడా కేబినెట్‌లోకి తీసుకుంటే… ఏకంగా మూడు మంత్రి ప‌ద‌వులు ఒకే సామాజిక వ‌ర్గానికి, అలాగే ఇద్ద‌రు అన్న‌ద‌మ్ముల‌కు తీసుకున్న‌ట్టు అవుతుంది.

చంద్ర‌బాబు మాత్రం ఇద్ద‌రు కాపుల‌కు మాత్ర‌మే మంత్రి ప‌ద‌వులు ఇచ్చారు. దీన్నిబ‌ట్టి కాపుల‌కు చంద్ర‌బాబు ఆలోచ‌న విధానం ఏంటో అర్థం చేసుకోవ‌చ్చు. కాపుల‌ను ప‌ట్టించుకోడానికి ప‌వ‌న్ ఉన్నార‌ని, వాళ్ల‌ది త‌న బాధ్య‌త కాద‌న్న‌ట్టు చంద్ర‌బాబు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని టీడీపీ కాపులు మండిప‌డుతున్నారు. కేవ‌లం ప‌వ‌న్‌కు కాపు కాస్తే చాల‌నే ఉద్దేశంతో చంద్ర‌బాబు ఉండ‌డం వ‌ల్లే, త‌మ‌కు తీర‌ని ద్రోహం జ‌రుగుతోంద‌ని వాళ్లు అంటున్నారు. క‌నీసం నామినేటెడ్ పోస్టుల్లో కూడా న్యాయం జ‌ర‌గ‌లేద‌ని వాళ్లు వాపోతున్నారు. నిన్న‌టికి నిన్న న‌లుగురు స‌ల‌హాదారుల్ని తీసుకుంటే… వాళ్ల‌లో ఇద్ద‌రు క‌మ్మ‌, ఒక రెడ్డి, మ‌రొక‌రు కేర‌ళ‌కు చెందిన వారున్నారు. ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో అంట‌కాగినంత కాలం త‌మ‌కు టీడీపీలో భ‌విష్య‌త్ వుండ‌ద‌ని కాపులు ల‌బోదిబోమంటున్నారు.

ఇదే వైఎస్ జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో అత్య‌ధిక ప‌దవులు, ల‌బ్ధి పొందింది కాపులే. బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, పేర్ని నాని, అంబ‌టి రాంబాబు, క‌న్న‌బాబు, ఆళ్ల నాని, గుడివాడ అమ‌ర్నాథ్‌ పేర్లు ప్ర‌ముఖంగా వినిపించేవి. కానీ జ‌న‌సేనాని ప‌వ‌న్‌లో కాపులు త‌మ నాయ‌కుడిని చూసుకున్నారు. ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ చెప్పిన‌ట్టే వాళ్ల‌లో మెజార్టీ కూట‌మికి అండ‌గా నిలిచింది. అయితే ప‌వ‌న్ కార‌ణంగానే త‌మ‌ను చంద్ర‌బాబు అస‌లు ప‌ట్టించుకోలేద‌ని కాపులు ర‌గిలిపోతున్నారు. ఆ మ‌ధ్య క‌డ‌ప‌లో బ‌లిజ‌ల స‌మావేశంలో బ‌హిరంగంగానే త‌మ అసంతృప్తిని వ్య‌క్తం చేశారు.

ప‌వ‌న్‌ను కాద‌ని, కాపులు త‌మ‌కు ప్ర‌యోజ‌నం క‌లిగించే పార్టీకి అండ‌గా నిలిచిన‌ప్పుడే, అన్ని ర‌కాలుగా గుర్తింపు, గౌర‌వం వుంటుంది. ప‌వ‌న్ కోసం కాపులు త్యాగ‌రాజులుగా మిగిలితే, ఆయ‌న సొంత ప్ర‌యోజ‌నాల్ని మాత్ర‌మే నెర‌వేర్చుకుంటారు. కావున టీడీపీ , జ‌న‌సేన కాపులు భ‌విష్య‌త్‌పై కీల‌క నిర్ణ‌యం తీసుకోవాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంది.

17 Replies to “ప‌వ‌న్‌ను ‘కాపు’ కాస్తే స‌రా?.. టీడీపీ కాపుల గుస్సా!”

  1. జనాలు 11 సీట్ లకి దింపేసినా కానీ మీకు బుద్ది రాలేదా.. సలహాదారులు లని ప్రాధాన్యత మరియు అర్హత లని బట్టి తీసుకుంటారు…. కులాల pratipadikana కాదు

  2. ఇంత దరిద్రమైన ఆర్టికల్ రాయడానికి నువ్వు ఏమి చదువుకున్నావో కానీ నీ కన్నా వరెస్ట్ గా ఈ ప్రపంచంలో ఎవడూ

    ఉండడు ..

  3. వైసీపీ ప్రభుత్వం లో కాపులు జగన్ గారి పాలేరులు లాగా పవన్ ని బాబు గారిని తిట్టడానికి మాత్రమే అధికారాలు లేని మంత్రులు గ మిగిలేరు అదే కూటమిలో వాళ్ళ షేర్ వాళ్ళు తీసుకొంటున్నారు

  4. కాపులందరు వైకాపా లోనే ఉండాలి అని కవి గారి మనస్సులో మాట…. అదే చెప్పండి… డొంక తిరుగుడు ఎందుకు….

  5. ////ప‌వ‌న్‌ను కాద‌ని, కాపులు త‌మ‌కు ప్ర‌యోజ‌నం క‌లిగించే పార్టీకి అండ‌గా నిలిచిన‌ప్పుడే, అన్ని ర‌కాలుగా గుర్తింపు, గౌర‌వం వుంటుంది. ప‌వ‌న్ కోసం కాపులు త్యాగ‌రాజులుగా మిగిలితే, ఆయ‌న సొంత ప్ర‌యోజ‌నాల్ని మాత్ర‌మే నెర‌వేర్చుకుంటారు. ///

    .

    ఇదె పిలుపు ముందు మన రెడ్డ్లకి ఇస్తె పొలా GA???

    .

    అవినీతి కెసులు మునిపొయిన లఫూట్ Jagan ను కాద‌ని, రెడ్లలొ మంచి వారి తొ .. నిజయితీ పరులతొ పార్టి పెట్టి, వారి వెంట నిలిస్తె… రెడ్డ్లకి అన్ని ర‌కాలుగా గుర్తింపు, గౌర‌వం వుంటుంది.

    .

    Jagan కోసం రెడ్లు త్యాగ‌రాజులుగా మిగిలితే, ఆయ‌న సొంత కెసులు, ప్ర‌యోజ‌నాల్ని మాత్ర‌మే నెర‌వేర్చుకుంటారు అని నువ్వు నిజాలు కకెయావచ్చుగా?

  6. చాల కరెక్ట్ గ రాసారు. ఇదే జాడ్యము రెడ్డి కమ్ముల లో కూడా ఉంది. కానీ వాళ్ళు అధికారం లోకి వస్తున్నారు కాబట్టి మిగిలిన కులాలకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇవ్వాల్సి వస్తుంది కూడా. కానీ ఇప్పుడు కాపులలో మెజారిటీ పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నరని గ్రహించి బాబు గారు పవన్ ని పొగడ్డం వాళ్ళింట్లోవాళ్లకు పదవులు ఇవ్వడం లాటివి చేస్తున్నారు. కేవలం మెగా ఫామిలీ లో ఒకరు డీసీఎం అయితే కాపులు బాగుపడ్డట్ట లేదా వాళ్లే ఆలోచించుకోవాలి. ఒక్కటైతే వాస్తవం టీడీపీ పార్టీ లేదా వైసీపీ పార్టీ మద్దతు లేకుంటే జనసేన పార్టీ అధిపతి కూడా గెలవలేరు.

  7. వైసీపీ ప్రభుత్వం లో కాపులు జగన్ గారి పాలేరులు లాగా పవన్ ని బాబు గారిని తిట్టడానికి మాత్రమే అధికారాలు లేని మంత్రులు గ మిగిలేరు అదే కూటమిలో వాళ్ళ షేర్ వాళ్ళు తీసుకొంటున్నారు

Comments are closed.