పీపుల్స్ మీడియా నుంచి వివేక్ బయటకు?

తన స్వంత బ్యానర్ ను ఫ్లోట్ చేసి, త్వరలో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తో సినిమా ప్రారంభిస్తారని వినిపిస్తోంది.

చిరకాలంగా వార్తల్లో వున్న సంగతి పీపుల్స్ మీడియా సంస్థ నుంచి కో ప్రొడ్యూసర్ వివేక్ కూచిభొట్ల బయటకు వచ్చేస్తారని. ఇది ఎప్పటి నుంచో వినిపిస్తోంది. విశ్వప్రసాద్ కు, వివేక్ కు విబేధాలు వున్నాయని ఇండస్ట్రీ అంతా గుసగుసలు వున్నాయి. కానీ వారి ప్రయాణం కలిసి సాగుతూనే వుంది. టాలీవుడ్ లో వివేక్ ప్రయాణం ఈనాటిది కాదు. కామాక్షి కమర్షియల్స్ తో మొదలైంది. పలువురు నిర్మాతలతో అసోసియేషన్ వుంది. కానీ పీపుల్స్ మీడియాను మొదటి నుంచీ అంటి పెట్టుకుని వున్నారు. అందువల్ల బయటకు వస్తారని ఎవరూ అనుకోలేదు. మధ్యలో ఓన్ ప్రొడక్షన్ చేస్తారని, త్రివిక్రమ్ తో కలిసి ప్రొడక్షన్ చేస్తారని ఇలా చాలా వార్తలు వినిపించాయి.

ఇప్పుడు కూడా రాజాసాబ్, గూఢచారి 2, ఇంకా చాలా ప్రాజెక్టులతో వివేక్ అసోసియేట్ అయి వున్నారు. వివేక్ బయటకు వస్తే దగ్గరకు తీసుకుందామని చాలా మందే చూస్తున్నారు. ఎందుకంటే వివేక్ కు టాలీవుడ్ లో మంచి పేరు వుంది. పలుకుబడి వుంది. పైగా పని వచ్చు. అందువల్ల వివేక్ తో అసోసియేట్ కావడానికి చాలా మంది సిద్దంగా వన్నారు. కానీ వివేక్ మాత్రం ఆచి తూచి అడుగేస్తున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే పీపుల్స్ మీడియాతో తెగతెంపులు అంటే అంత సులువు కాదు. డబ్బు లావాదేవీలు, లెక్కలు, ఇచ్చి పుచ్చుకోవడాలు అన్నీ తేలాల్సి వుంటుంది.

అయితే ఇప్పుడు తెగతెంపులు అయిపోయాయని, లెక్కలు తరువాత తేల్చుకుంటారని, ప్రస్తుతానికి వివేక్ తన రియల్ ఎస్టేట్ వ్యాపారాల మీద ఎక్కువగా పని చేస్తున్నారని తెలుస్తోంది. తన స్వంత బ్యానర్ ను ఫ్లోట్ చేసి, త్వరలో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తో సినిమా ప్రారంభిస్తారని వినిపిస్తోంది.

మొత్తం మీద టాలీవుడ్ లో ఇదో అంకం. పీపుల్స్ మీడియా ఇప్పుడు స్వంతంగా బౌన్స్ బ్యాక్ కావాల్సి వుంటుంది.

2 Replies to “పీపుల్స్ మీడియా నుంచి వివేక్ బయటకు?”

Comments are closed.