బాలకృష్ణపై బెట్టింగ్ ఆరోపణలు

చేసిన అప్పులు తీర్చలేక భార్యపిల్లల్ని వదిలి ఊరు విడిచిపెట్టి వచ్చేశాడు రాంబాబు. 8 నెలల నుంచి అక్కడాఇక్కడ తలదాచుకుంటున్నాడు.

బెట్టింగ్ యాప్స్ కు ప్రచారం చేశారనే ఆరోపణలపై ఇప్పటికే విజయ్ దేవరకొండ, రానా, అనన్య నాగళ్ల, నిధి అగర్వాల్, ప్రకాష్ రాజ్ లాంటి నటీనటులపై కేసు ఫైల్ అయిన సంగతి తెలిసిందే. ఈ లిస్ట్ లోకి బాలకృష్ణను కూడా చేర్చాలని డిమాండ్ చేస్తున్నాడు ఓ బెట్టింగ్ యాప్ బాధితుడు.

బాలకృష్ణ చేసిన అన్ స్టాపబుల్ కార్యక్రమంలో కింద వచ్చిన బెట్టింగ్ యాప్ చూసి తను ఇనస్టాల్ చేసుకున్నానని, ఏకంగా 83 లక్షలు పోగొట్టుకున్నానని ఆరోపిస్తున్నాడు నెల్లూరు జిల్లాకు చెందిన రాంబాబు.

అన్ స్టాబబుల్ కార్యక్రమంలో బాలకృష్ణ హోస్ట్ చేసిన ఓ కార్యక్రమానికి ప్రభాస్ ప్రత్యేక అతిథిగా వచ్చాడు. ఆ కార్యక్రమంలో బెట్టింగ్ యాప్ ప్రకటన తను చూశానని, దాంట్లో డబ్బులు పెట్టి మోసపోయానని అంటున్నాడు.

చేసిన అప్పులు తీర్చలేక భార్యపిల్లల్ని వదిలి ఊరు విడిచిపెట్టి వచ్చేశాడు రాంబాబు. 8 నెలల నుంచి అక్కడాఇక్కడ తలదాచుకుంటున్నాడు. బెట్టింగ్ యాప్స్ పై ప్రస్తుతం నడుస్తున్న చర్చ చూసి తనకు న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ కు వచ్చాడు.

ప్రస్తుతం తన సంచిలో పురుగుల మందు డబ్బా పెట్టుకొని తిరుగుతున్నానని, తనకు న్యాయం జరక్కపోతే, అది తాగి ఆత్మహత్య చేసుకుంటానని అంటున్నాడు రాంబాబు.

10 Replies to “బాలకృష్ణపై బెట్టింగ్ ఆరోపణలు”

  1. ఇదెమి సొల్లు ఆర్గుమెంట్రా అయ్యా! ఒక వెల అదె నిజం అయినా… అది టెలీకాస్ట్ చెసి ఆడ్స్ వెసిన OTT నొ TV, yt channel నొ భాద్యత వహించాలి కాని.. వాళ్ళు ఎమి యాడ్స్ వెస్తారొ బాలక్రిష నొ ప్రభాసొ నిర్నయిస్తారా?

  2. “11మోహన బటన్ నొక్కే ప్రోగ్రాం” సాక్షి టీవీ లో చూస్తున్నప్పుడు best బెట్టింగ్ app స్క్రోలింగ్ వచ్చింది.. దాన్ని చూసి ఆశపడి మా నీలి ఫ్రెండ్స్ కొందరు 11 కోట్లు పోగొట్టుకున్నారు కాబట్టి 11మోహన మీద కేసు ఫైల్ చెయ్యొచ్చా??

  3. “11మోహన బటన్ నొక్కే ప్రోగ్రాం” సాక్షి టీవీ లో చూస్తున్నప్పుడు best బెట్టింగ్ app స్క్రోలింగ్ వచ్చింది.. దాన్ని చూసి ఆశపడి మా నీలి ఫ్రెండ్స్ కొందరు 11 కోట్లు పోగొట్టుకున్నారు కాబట్టి 11మోహన మీద ‘కేసు ఫైల్ చెయ్యొచ్చా??

  4. ఇంకా నయం కండోమ్ ad vesaru, చూసి అది కొన్నాను .. అది పగిలి ఎయిడ్స్ వొచ్చింది అనలేదు ..

Comments are closed.