ఇదేంది బాబు గారు.. క‌ళాప్ర‌ద‌ర్శ‌న ముగిశాక మొద‌లెట్టారు!

చంద్ర‌బాబులో మామ ఎన్టీఆర్‌కు మించిన న‌టుడు ఉన్నాడ‌ని తెలుసుకోవ‌చ్చ‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ఏపీలోని ఎమ్మెల్యేలు, మంత్రులు, మండ‌లి స‌భ్యుల సాంస్కృతిక ప్ర‌ద‌ర్శ‌న‌లు ముగిసిన త‌ర్వాత‌, సీఎం చంద్ర‌బాబునాయుడు ప్ర‌త్యేకంగా త‌న‌దైన న‌ట‌నా కౌశ‌ల్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని జ‌నం అనుకుంటున్నారు. మ‌న‌వ‌డి పుట్టిన రోజు సంద‌ర్భంగా కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ఆయ‌న తిరుమ‌ల వెళ్లారు. ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ తిరుమ‌ల నుంచి ప్ర‌క్షాళ‌న ప్రారంభిస్తామ‌ని చెప్పి, ఇక్క‌డ నుంచే ప్రారంభించామ‌న్నారు. అలిపిరి వ‌ద్ద గ‌త ప్ర‌భుత్వంలో ముంతాజ్‌, ఎమ‌ర్‌, దేవాలోక్ హోట‌ల్స్ నిర్మాణానికి అనుమ‌తులు ఇచ్చార‌న్నారు. వాటి అనుమ‌తులు ర‌ద్దు చేస్తున్న‌ట్టు చంద్ర‌బాబు చెప్పారు. ఏడు కొండ‌ల‌కు ఆనుకుని ఎలాంటి నిర్మాణాల‌కు అనుమ‌తి ఇచ్చేది లేద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

ఇక్క‌డే చంద్ర‌బాబులో మామ ఎన్టీఆర్‌కు మించిన న‌టుడు ఉన్నాడ‌ని తెలుసుకోవ‌చ్చ‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు. 2014-19 మ‌ధ్య చంద్ర‌బాబు హ‌యాంలోనే దేవాలోక్ ప్రాజెక్ట్‌కు స్థలం కేటాయించిందని అంటున్నారు. అనంత‌రం వ‌చ్చిన జ‌గ‌న్ స‌ర్కార్ ఇందులోనే 20 ఎక‌రాల‌ను ఒబెరాయ్ గ్రూప్‌న‌కు కేటాచింది. వాళ్లే ముంతాజ్ హోట‌ల్ నిర్మాణానికి శ్రీ‌కారం చుట్టారు. అయితే కూట‌మి స‌ర్కార్ వ‌చ్చిన త‌ర్వాత ఏం చేసిందంటే…నిర్మాణాల‌కు తుడా అనుమ‌తులు మంజూరు చేస్తూ ఉత్త‌ర్వులు కూడా ఇవ్వ‌డం విశేషంగా చెప్పుకోవాలి.

పైగా తిరుప‌తిలో సెవెన్‌స్టార్ హోట‌ల్ నిర్మాణానికి కూట‌మి హ‌యాంలో అడ్డంకులు తొల‌గిన‌ట్టు…ప్ర‌భుత్వ అనుకూల మీడియా భారీగా ప్ర‌చారం చేసింది. రాయ‌ల‌సీమ‌లోనే తొలి సెవెన్‌స్టార్ ల‌గ్జ‌రీ హోట‌ల్‌ను తీసుకురావ‌డంతో సీఎం చంద్ర‌బాబు చొర‌వ చూపార‌ని కూడా రాసుకొచ్చారు. ఏడాదిన్న‌ర‌లో నిర్మాణాల్ని పూర్తి చేయాల‌ని ప్ర‌భుత్వం టార్గెట్ కూడా పెట్టింది. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి మొద‌టి వారంలో ఈ హోట‌ల్‌పై టీడీపీ అనుకూల మీడియా రాత‌లివీ…

“రాయలసీమలోనే తొలి సెవన్‌స్టార్‌ లగ్జరీ హోటల్‌ నిర్మాణానికి మూడేళ్లుగా ఉన్న అవరోధాలు సీఎం చంద్రబాబు చొరవతో తొలగిపోయాయి. ఇంతకాలం పెండింగులో ఉన్న తుడా అనుమతులు కూడా ఇటీవలే మంజూరయ్యాయి. పనులు మొదలు కావడంతో ఏడాదన్నరలో నిర్మాణాలు పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒబెరాయ్‌ గ్రూప్స్‌కు చెందిన మెస్సర్స్‌ ముంతాజ్‌ హోటల్స్‌ లిమిటెడ్‌ తిరుపతిలో సెవెన్‌ స్టార్‌ లగ్జరీ విల్లాస్‌తో కూడిన రిసార్ట్స్‌ ఏర్పాటుకు 2021లో ముందుకొచ్చింది.

తిరుమల కొండల పాదాల చెంత ఇటువంటి హోటల్‌ ఏర్పాటు వల్ల సంస్కృతి పాడవుతుందన్నది వాదన. అందులో మాంసాహారం, మద్యపానం, స్పా మసాజ్‌ సెంటర్‌ వంటివి ఉంటాయని ఈ సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఇది హిందూయేతర మతానికి చెందిన సంస్థగా భావించి సోషల్‌ మీడియాలో పోస్టులు వైరల్‌ అయ్యాయి. దీనిపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. సీఎం చంద్రబాబుకు అధికారులు నివేదిక పంపారు. మరోవైపు ఒబెరాయ్‌ సంస్థ ముంతాజ్‌ అన్న పేరుతో ఉన్న బోర్డును తొలగించి ట్రైడెంట్‌ గ్రూప్‌ అన్న పేరుతో బోర్డు ఏర్పాటు చేసింది. దీంతో నిర్మాణానికి అనుమతులు ఇచ్చినట్టు సమాచారం. రిసార్ట్స్‌ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని సీఎం ఆదేశించినట్టు సమాచారం. ఆ మేరకు తుడా నుంచీ ఇటీవలే అనుమతులు పొందిన ఒబెరాయ్‌ సంస్థ నిర్మాణ పనులు ప్రారంభించింది” అని రాశారు.

ఇప్పుడేమో సాధ‌వులు పెద్ద ఎత్తున ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ఉద్య‌మిస్తుండ‌డంతో చెడ్డ‌పేరు వ‌చ్చింద‌ని ప్ర‌భుత్వానికి భ‌యం ప‌ట్టుకుంది. దీంతో వెంట‌నే చంద్ర‌బాబు మాట మార్చారు. అలిపిరి వ‌ద్ద గ‌త ప్ర‌భుత్వంలో హోట‌ల్స్ నిర్మాణానికి అనుమ‌తులు ఇచ్చార‌ని ఆరోపించ‌డం చంద్ర‌బాబుకే చెల్లింది. అంతేకాదు, అనుమ‌తులు ర‌ద్దు చేస్తున్న‌ట్టు చంద్ర‌బాబు చెప్పారు. అనుమ‌తులు ఇవ్వ‌డం, ర‌ద్దు చేయ‌డం అంతా ఆయ‌న చేస్తారు. నింద‌లు మాత్రం గ‌త ప్ర‌భుత్వంపైన‌.

చంద్ర‌బాబు త‌న కూట‌మి ప్ర‌జాప్ర‌తినిధుల‌తో పాటు క‌ళా ప్ర‌ద‌ర్శ‌న చేసి వుంటే బాగుండేద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఎందుకంటే, ఇప్పుడీ హోట‌ల్స్ నిర్మాణాల్ని ర‌ద్దు చేయాల‌ని టీటీడీ ఈవో శ్యామ‌లారావు ఏపీ హైకోర్టులో అఫిడవిట్ దాఖ‌లు చేశారు. ఇందులో తిరుమ‌ల ప‌విత్ర‌త‌ను కాపాడేందుకు ఏడు కొండ‌ల‌ను తిరుమ‌ల దివ్య క్షేత్రంగా ప్ర‌క‌టిస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం 2007 జూన్‌లో జీవో 746 జారీ చేసిన‌ట్టు పేర్కొన్నారు. 2007లో ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి. వైఎస్సారే ఏడుకొండ‌ల‌ను దివ్య క్షేత్రంగా ప్ర‌క‌టిస్తూ జీవో జారీ చేయ‌డాన్ని చంద్ర‌బాబు స‌ర్కార్ అనివార్యంగా హైకోర్టులో ప్ర‌స్తావించాల్సి వ‌చ్చింది. కానీ హోట‌ల్స్ నిర్మాణంపై తీవ్ర వ్య‌తిరేక‌త రావ‌డంతో, త‌న ప్ర‌భుత్వ‌మే ఇచ్చిన అనుమ‌తుల్ని ర‌ద్దు చేయ‌డం కేవ‌లం చంద్ర‌బాబుకే చెల్లుతుంద‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

19 Replies to “ఇదేంది బాబు గారు.. క‌ళాప్ర‌ద‌ర్శ‌న ముగిశాక మొద‌లెట్టారు!”

  1. In 2021, when the Jagan Mohan Reddy-led Andhra Pradesh government issued a Government Order (GO) under its 2020-2025 Tourism Policy. The order proposed a large-scale luxury tourism project, offering incentives to developers. Mumtaz Hotels Limited, a subsidiary of The Oberoi Group, was allocated 20 acres of land to build a resort featuring 100 luxury villas with an initial investment of Rs 250 crore. In November 2024, TTD chairman BR Naidu passed a resolution urging the state government to revoke the land allotment. The board firmly believed that commercialisation of the sacred area would hurt the sentiments of millions of devotees visiting the temple. Vaishnavi Versatile with 10.32 acres, Mumtaz Hotel with 20 acres, and MRKR Construction Industries Private Limited with 5 acres:- permissions of all the three are cancelled by Kootami govt

  2. మా A1ఎర్రోణ్ణి ప్రతీ విషయంలో తప్పులు వెతికి మరీ దె0గితే ఎట్టా??

    దె0గితే దె0గారు పవన్, వంశీ మాదిరిగా కాస్త అందగాళ్లు ఐనా దె0గితే సమ్మగా సహకరిస్తూ దె0గించుకుంటాడు..

  3. ఈ చంద్రబాబు అంత నీచుడు ఎవరు ఉండరేమో తను చేసిన తప్పుని ఇంకొకరిపైన నెట్టేయడం అంటే అంతకంటే దిగజారడానికి ఇంకేమి ఉండదేమో.

  4. 40 ఇయర్స్ ఇండస్ట్రీ గాడికి.. ఇలా.. నాలుక ఎప్పుడు పడితే అప్పుడు మడతెత్తడం కొత్తేమి కాదు!

    ఆడు నాలుక మొదటెట్టాకోకుంటే.. ఆశ్చర్యం కానీ.. మడతేడితే ఆశ్చర్యం ఏముంది?

    సూపర్ సిక్స్ ఇవ్వాలనుకున్నాను.. కానీ.. ఖజానా. ఖాళీగా కనపదిస్థాన్ది .. అన్నపుడే.. మేడలో.. చెప్పులదండతో..ఊరేగించి కొట్టాల్సింది. చేత కాకపోతే.. దిగిపొర అని.

    మరి.. సూపర్ 6 ఇవ్వనప్పుడు.. ఆ 131000కొట్లాసొమ్ము అప్పుగా 9 నెలలలో తెచ్చి ఎక్కడ ఖర్చుపెట్టినట్టు ఈ లెప్రసి పేషెంటు?

Comments are closed.