టీడీపీ ప్లెక్సీల‌ను పెట్ట‌నివ్వ‌ని జ‌న‌సేన ఎమ్మెల్యే

టీడీపీ తిరుప‌తి ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే సుగుణ‌మ్మ‌తో పాటు ఆ పార్టీ నాయ‌కుల ప్లెక్సీలు క‌నిపించ‌డానికి వీల్లేద‌ని ఎమ్మెల్యే సంబంధిత అధికారుల్ని హెచ్చ‌రించారు.

టీడీపీతో ఇంకా 15 ఏళ్లు క‌లిసే వుంటామ‌ని, ఏవైనా చిన్న‌చిన్న స‌మ‌స్య‌లు వ‌స్తే ప‌రిష్క‌రించుకుంటామ‌ని జ‌న‌సేన అధిప‌తి, డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్ అసెంబ్లీ వేదిక‌గా ప్ర‌క‌టించారు. కానీ క్షేత్ర‌స్థాయిలో టీడీపీ, జ‌న‌సేన మ‌ధ్య స్నేహ‌పూర్వ‌క సంబంధాలు క‌నిపించ‌డం లేదు. తిరుప‌తిలో జ‌నసేన‌, టీడీపీ మ‌ధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి.

తిరుప‌తి అసెంబ్లీ నుంచి జ‌న‌సేన త‌ర‌పున ఆర‌ణి శ్రీ‌నివాసులు గెలుపొందారు. చిత్తూరు నుంచి తీసుకొచ్చి త‌మ‌పై బ‌ల‌వంతంగా రుద్దుతున్నార‌ని, ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆయ‌న అభ్య‌ర్థిత్వాన్ని అప్ప‌ట్లో అంద‌రూ వ్య‌తిరేకించారు. అయితే ప‌వ‌న్‌క‌ల్యాణ్, చంద్ర‌బాబు త‌మ‌త‌మ నాయ‌కుల‌కు స‌ర్ది చెప్ప‌డంతో ఆర‌ణి గెలుపు కోసం ప‌ని చేశారు. ఆర‌ణి తిరుప‌తి ఎమ్మెల్యే అయ్యారు.

ఆ త‌ర్వాత టీడీపీ, అలాగే జ‌న‌సేన‌లో త‌నను వ్య‌తిరేకించే వాళ్ల‌కు ఆర‌ణి శ్రీ‌నివాసులు సినిమా చూపిస్తున్నారు. తాజాగా మ‌న‌వ‌డు దేవాన్ష్ పుట్టిన రోజు పుర‌స్క‌రించుకుని సీఎం చంద్ర‌బాబు కుటుంబం తిరుమ‌ల‌కు వెళ్లింది. ఈ సంద‌ర్భంగా దేవాన్ష్‌కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌ల‌తో పాటు బాబు, లోకేశ్‌కు స్వాగ‌తం ప‌ల‌కాల‌ని టీడీపీ నాయ‌కులు అనుకున్నారు.

కానీ టీడీపీ తిరుప‌తి ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే సుగుణ‌మ్మ‌తో పాటు ఆ పార్టీ నాయ‌కుల ప్లెక్సీలు క‌నిపించ‌డానికి వీల్లేద‌ని ఎమ్మెల్యే సంబంధిత అధికారుల్ని హెచ్చ‌రించారు. దీంతో చంద్ర‌బాబు, లోకేశ్‌ల‌కు స్వాగ‌తం ప‌లుకుతూ ప్లెక్సీలు పెట్టుకోలేద‌ని ద‌య‌నీయ స్థితిలో ఉన్నామ‌ని టీడీపీ నేత‌లు వాపోతున్నారు. ఇలాంటి దుస్థితి త‌మ‌కు వ‌స్తుంద‌ని అస‌లు ఊహించ‌లేద‌ని టీడీపీ నేత‌లు అంటున్నారు.

కేవ‌లం తిరుప‌తి ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీ‌నివాసులు, టీడీపీలో ఎమ్మెల్యేకు దగ్గ‌రి నాయ‌కుడికి సంబంధించి మాత్ర‌మే తిరుప‌తి న‌గ‌రంలో ప్లెక్సీలు క‌నిపించాయి. ఆర‌ణి శ్రీ‌నివాసులు త‌మ‌పై తీవ్ర అణ‌చివేత చ‌ర్య‌లు చేప‌ట్ట‌డంపై టీడీపీతో పాటు జ‌న‌సేన‌లోని ఆయ‌న వ్య‌తిరేక వ‌ర్గీయులు ర‌గిలిపోతున్నారు.

9 Replies to “టీడీపీ ప్లెక్సీల‌ను పెట్ట‌నివ్వ‌ని జ‌న‌సేన ఎమ్మెల్యే”

  1. మీరే అసలు విషయం చెప్తున్నారు….టీడీపీ వాళ్ళ ఫ్లెక్సీ లు ఉన్నాయ్..కానీ సుగుణమ్మ వి లేవు….ఈవిడ అల్లుడు షాడో ఎమ్మెల్యే గ ఉండి పార్టీ కి బాగా చెడ్డ పేరు తీసుకువచ్చారు కదా..అందుకే ఈమె ని ఎంకరేజ్ చెయ్యలేలేదేమో…ఐన సమ్మగా 4 ఏళ్ళు పడుకోకుండా ఎందుకొచ్చిన తిప్పలు ivi

  2. ఐన మీ ప్రకారం జనసేన బీజేపీ ల్లో ఉన్న ఎమ్మెల్యేలు అంత చంబా తాలూకు స్లీపర్ సెల్స్ యే కదా….ఫ్లెక్సీ లు ఎవరు కడితే ఏంటి????

Comments are closed.