బాబు సమక్షంలో రాజు గారు

చాలా కాలానికి ఒక సన్నివేశం ఆవిష్కృతమైంది. విజయవాడలో జరిగిన శాసన సభ్యుల సాంస్కృతిక కార్యక్రమాలలో పార్టీకి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. వారిలో టీడీపీ సీనియర్ నాయకుడు ఎన్నో దశాబ్దాల పాటు పార్టీలో ప్రభుత్వంలో…

చాలా కాలానికి ఒక సన్నివేశం ఆవిష్కృతమైంది. విజయవాడలో జరిగిన శాసన సభ్యుల సాంస్కృతిక కార్యక్రమాలలో పార్టీకి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. వారిలో టీడీపీ సీనియర్ నాయకుడు ఎన్నో దశాబ్దాల పాటు పార్టీలో ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు కనిపించారు.

ఆయన వేదిక మీద ముఖ్యమంత్రి చంద్రబాబు ఉంటే వేదిక దిగువన ముందు వరసలో కూర్చుని కార్యక్రమాలను ఆద్యంతం తిలకించారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆయన గుర్తించి ప్రస్తావిస్తూ మేమంతా 1983 టీడీపీ బ్యాచ్ అని చెప్పుకొచ్చారు.

అశోక్ గజపతిరాజు విషయానికి వస్తే ఆయన 2024 ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఎంపీగా ఆయనకు కాకుండా శ్రీకాకుళం జిల్లాకు చెందిన కలిశెట్టి అప్పలనాయుడుకు చాన్స్ ఇచ్చారు. అశోక్ కి రాజ్యసభ కానీ గవర్నర్ పదవి కానీ ఇస్తామన్న హామీ అయితే ఉంది అని అప్పటి నుంచి ప్రచారంలో ఉంది.

అయితే ఇటీవల రెండు రాజ్యసభ సీట్లు టీడీపీ తీసుకుంది. కానీ రాజు గారి ప్రస్తావన లేదు. గవర్నర్ పదవుల విషయంలో కూడా క్లారిటీ లేదు. రాజు గారు చాలా కాలంగా ఏపీ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు అని వార్తలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో ఆయన ఒకింత రాజకీయ వైరాగ్యం కూడా చూపిస్తున్నారు అని కూడా అంతా మాట్లాడుకున్నారు. అయితే రాజు గారు బాబు సమక్షంలో కనిపించడంతో ఆయన ప్రాధాన్యత మళ్ళీ టీడీపీలో ఉంటుందని అంటున్నారు. సరైన సమయంలో సరైన అవకాశం ఆయనను వరిస్తుందని అంటున్నారు. ఆయనకు గవర్నర్ పదవి కచ్చితంగా దక్కుతుందని లేట్ అయినా ఆయన హోదాకు గౌరవానికి తగిన అవకాశమే ఇస్తారని అంటున్నారు.

తనకు అత్యంత సన్నిహితుల విషయంలో చంద్రబాబు కరెక్ట్ నిర్ణయమే తీసుకుంటారు అని అంటున్నారు. మరి రాజు గారికి గౌరవనీయమైన స్థానం దక్కుతుందా ఎపుడు అది అన్నది ఆయన అభిమానులలో చర్చగా ఉంది. హైకమాండ్ అయితే ఆయన పట్ల పూర్తి సానుకూలతతో ఉందన్న వార్తలు మాత్రం వారిని ఆనంద పరుస్తున్నాయి.

5 Replies to “బాబు సమక్షంలో రాజు గారు”

  1. సీనియర్ లని ఎలా గౌరవించుకోవాలో టీడీపీ బాగా తెలుసు. అయినా రాజుగారి కుమార్తె కు MLA సీట్ ఇచ్చారు.

Comments are closed.