వైసీపీ స‌భ్యుల సంత‌కాల వెనుక ఏం జ‌రిగిందంటే?

మేమేమీ గోడలు దూకి, అర్ధరాత్రులు, అపరాత్రుల్లో సంతకం పెట్టలేదు

ఏడుగురు వైసీపీ స‌భ్యులు దొంగ‌ల్లా సంత‌కాలు చేసి వెళుతున్నార‌ని స్పీక‌ర్ అయ్య‌న్న‌పాత్రుడు ఘాటు విమ‌ర్శ‌లు చేయ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ప్ర‌శ్న‌లు వేస్తారే త‌ప్ప‌, స‌భ‌కు రావ‌డం లేద‌ని, దీంతో ఇత‌ర స‌భ్యులు మాట్లాడే అవ‌కాశాన్ని కోల్పోతున్నార‌ని ఆయ‌న తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేయ‌డాన్ని చూశాం. అయితే వైసీపీ స‌భ్యులు సంత‌కాలు చేయ‌డం వెనుక ఏం జ‌రిగిందో ఆరా తీయ‌గా ఆస‌క్తిక‌ర విష‌యం వెలుగు చూసింది.

వివిధ అంశాల‌పై ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించాలంటే, త‌ప్ప‌నిస‌రిగా రిజిస్ట‌ర్‌లో సంత‌కాలు చేయాల‌ని అసెంబ్లీ అధికారులు వైసీపీ స‌భ్యుల‌కు సూచించారు. లేదంటే, ప్ర‌శ్న‌ల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోర‌ని చెప్ప‌డంతోనే సంత‌కాలు చేసిన‌ట్టు స‌మాచారం. దీన్ని కూడా కూట‌మి ప్ర‌భుత్వం రాద్ధాంతం చేయ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోందని వైసీపీ స‌భ్యులు మండిప‌డుతున్నారు. ఈ మాత్రం కూడా త‌మ‌ను విమ‌ర్శించే వాళ్ల‌కు తెలియ‌దా? అని వైసీపీ ఎమ్మెల్యేలు నిల‌దీస్తున్నారు.

ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలోనే వైసీపీ స‌భ్యుల‌ గైర్హాజ‌రుపై స్పీక‌ర్ అయ్య‌న్న‌పాత్రుడు ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించ‌డాన్ని గ‌మ‌నించొచ్చు. క‌ర్నూలులో గ్రీన్‌కో ప్రాజెక్ట్‌కు సంబంధించి వైసీపీ స‌భ్యులు బాల‌నాగిరెడ్డి, విరూపాక్షిలు లిఖిత‌పూర్వ‌కంగా అడిగిన ప్ర‌శ్న ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో చ‌ర్చ‌కు వ‌చ్చింది. అప్పుడే స్పీక‌ర్ ఘాటు విమ‌ర్శ‌లు చేశారు. వైసీపీ స‌భ్యులు రాత‌మూల‌కంగా ప్ర‌శ్న‌ల్ని స‌భ‌కు పంపిస్తున్నారే త‌ప్ప‌, స‌భ‌కు రావ‌డం లేద‌ని స్పీకర్ అన్నారు. దీనివ‌ల్ల ఈ స‌మావేశాల్లో 25 ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ల‌భించ‌లేద‌న్నారు.

త‌మ‌ను దొంగ‌లుగా స్పీక‌ర్ అభివ‌ర్ణించ‌డంపై వైసీపీ ఎమ్మెల్యే తాటిప‌ర్తి చంద్ర‌శేఖ‌ర్ ఎక్స్ వేదిక‌గా ఘాటుగా స్పందించారు. “మేమేమీ గోడలు దూకి, అర్ధరాత్రులు, అపరాత్రుల్లో సంతకం పెట్టలేదు. మా నియోజకవర్గ సమస్యలను ప్రశ్నల రూపంగా సభ ముందుకు తీసుకొచ్చే క్రమంలో అసెంబ్లీ సిబ్బంది సూచన మేరకే సంతకాలు పెట్టాం కానీ దొంగలుగా కాదు” అని ఆయ‌న తేల్చి చెప్పారు. స‌భ్యుల ప్ర‌శ్న‌ల్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాలంటే త‌ప్ప‌నిస‌రిగా రిజ‌స్ట‌ర్‌లో సంత‌కాలు వుండాల‌ని అధికారుల సూచ‌న మేర‌కే చేశార‌ని స్ప‌ష్ట‌మైంది. ఈ సంగ‌తి తెలిసి కూడా స్పీక‌ర్ స‌భ్యుల్ని కించ‌ప‌రిచేలా మాట్లాడ్డంపై చంద్ర‌శేఖ‌ర్ తీవ్రంగా స్పందించారు.

“బహుజన శాసన సభ్యులను దొంగలని సంభోదించడం స్పీకర్ గారి విజ్ఞతకు వదిలేస్తున్నా. ప్రజాస్వామ్యంలో దొంగలంటే ముఖ్యమంత్రిని వెన్నుపోటు పొడిచి కుర్చీ ఎక్కినోళ్లు, వేలంపాటలో సభ్యులను సరసమైనా ధరతో కొన్నోళ్లు, వైశ్రాయ్ హోటల్లో క్యాంపులు నడిపినోళ్లు, స్పీకర్ ను అడ్డుపెట్టుకొని పార్టీ పక్షనేతను పోటు పొడిచినోళ్లు, జయప్రదంగా పార్టీని, పార్టీ నిధిని దోచినోళ్లని స్పీకర్ గారు తెలుసుకోగలరని ఆశిస్తున్నా” అని చీవాట్లు పెట్టారు. స్పీకర్‌ను క‌దా అని వైసీపీ వాళ్ల‌ను ఏది ప‌డితే అది మాట్లాడితే, అటువైపు ప‌ది మాట‌లు ఎదురొస్తాయ‌ని గ్ర‌హించ‌క‌పోవ‌డం విషాదం.

12 Replies to “వైసీపీ స‌భ్యుల సంత‌కాల వెనుక ఏం జ‌రిగిందంటే?”

  1. మాడా మోహన రెడ్డి ” భయానికి మీరు భలి అయ్యి,

    మాజీ MLA లు కావద్దు

    అవసరమైతే A1ఎదవ ని దిక్కరించి, మిమల్ని గెలిపించిన ప్రజలకి న్యాయం చేయండి.. దొంగలుగా మాత్రం మారోద్దు

    ఆనాడు చేసిన తప్పులకి కర్మ అనుభవించాల్సి ఉంటుందని

    “లంగా మోహన రెడ్డి” అసెంబ్లీ కి వస్తే RAGGING చేసి, ‘ఉచ్చ పోయిస్తారని భయం.. అందుకే ప్రజలివ్వని ప్రతిపక్ష నేత హోదా సాకుతో తప్పించుకుంటున్నాడు.. కానీ మిగతా MLA లు, వాడి భయనికి

    మీరు భలి అయ్యి, మాజీ MLA లు కావద్దు

    అవసరమైతే A1ఎదవ ని దిక్కరించి, మిమల్ని గెలిపించిన ప్రజలకి న్యాయం చేయండి.. దొంగలుగా మాత్రం మారోద్దు

    1. అసెంబ్లీ కి వస్తే అన్నియ్య పాండిత్యం తెలిసిపోతుంది. అక్కడ లోకేష్ తో పోలిక వస్తే పరువు పోతుందని భయం పట్టుకుంది. ఇదీ అసలు విషయం హోదా కాదు పాడు కాదు.

  2. మనకి ఎన్నికల మెషిన్ పగలగొట్టడం సరి అయినదే…. తల్లి మీద పంచాయితీ చెయ్యడం సరి అయినదే…. దొంగ సంతకాలు చేసి అసెంబ్లీ కి ఎగనామం పెట్టడం కూడా సరి అయినదే…. రాజధానిని ఆపేసి ఆ భూములు పట్టాలు పంచేయడం సరి అయినదే….గొడ్డలి పోటు, కోడి కత్త్తి, గులకరాయి, బూతులు అన్నీ ఆనవాయితీలే మనకి….ఎక్కడ దొరికిన సంత రా…. దొంగ సంతకాలు పెట్టారు అనగానే బహుజన శాసన సభ్యులు అయిపోయారు…. కులం అడ్డు పెట్టుకుంటే కానీ తప్పించుకోలేరు అన్నమాట….

  3. MLA’s It’s time to REVOLT for a better cause.

    ఈ పది మంది MLA లు ఎంతో కస్టపడి, వాళ్ళ సొంత భలం తో గెలిచి, వాళ్ళ నియోజకవర్గ సమస్యలని అసెంబ్లీ లో లేవనెత్తి వాటికి పరిష్కారం చూపాలని ఎన్నో ఆశలతో ఎదురుచూస్తుంటే,

    ఈ ‘సైకో గాడు, వాడి కర్మ తప్పించుకోవడం కోసం మిమ్మల్ని కట్టడి చేస్తూ, దొంగలుగా మారుస్తున్నాడు, మీ ప్రజలని మోసం చేస్తున్నాడు..

    so Its టైం to REVOLT for a better cause.

  4. సంతకాల వెనుక ఏం జరిగిందో తెలియదు కాని, నీ కవర్ డ్రైవ్ మాత్రం స్టార్ట్ అయింది

  5. ప్రభుత్వాన్ని నిలదీయాలంటే సభకే వెళ్లాల్సిన పనిలేదు, ఇంటి బయట ప్రెస్ మీట్ పెట్టి ప్రశ్నిస్తామని చెప్పి, మళ్ళీ సభకి ప్రశ్నలు పంపడమేంటి ? మీ డ్రామాలు ఆపండి.

Comments are closed.