రేవంత్ రెడ్డి తిరుమల వెళ్లడం మానేస్తారా?

తిరుమలకు మాత్రమే వెళ్లాలని ఎందుకు అనుకోవాలి? యాదగిరి గుట్టకు వెళితే సరిపోతుంది కదా?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తిరుమల వేంకటేశ్వరుడి దర్శనానికి వెళ్లడం గురించి.. ఏపీ ప్రభుత్వాన్ని టీటీడీ అధికారుల్ని ప్రతిసారీ అడుక్కోవడం ఏమిటి? అంటూ ఆయన ఆగ్రహించారు. వాళ్లకు టీటీడీ ఉంటే మనకు వైటీడీ ఉన్నది కదా.. అని తమ ప్రాంతీయ ఆధ్యాత్మిక ఘనతను చాటుకోవడానికి ప్రయత్నించారు.

తిరుమలకు వెళ్లి బతిమాలుకునే బదులు తెలంగాణలో ఉన్న ఆలయాలకు వెళ్లొచ్చు. తెలంగాణకు అద్భుతమైన సాంస్కృతిక వారసత్వం ఉంది.. మన ప్రాంతాలను మనం అభివృద్ధి చేసుకోవాలి అని ఆయన సెలవిచ్చారు. చూడబోతే.. ఈ వ్యాఖ్యల తరువాత.. రేవంత్ రెడ్డి తిరుమల వేంకటేశ్వరుని దర్శనానికి వెళ్లడం మానేస్తారేమో, దేవుడిని చూడాలనుకున్న ప్రతిసారీ యాదగిరిగుట్టకు వెళ్లడం మాత్రమే అలవాటు చేసుకుంటారేమో అని అనిపిస్తోంది.

రేవంత్ రెడ్డి.. రెండు రాష్ట్రాలుగా విడిపోయిన ఒకే ప్రాంతంలోని ఆధ్యాత్మిక ఆలయ విశిష్టతల గురించి చేసిన ఈ వ్యాఖ్యలు ఖచ్చితంగా వివాదాస్పదమైనవే. అవును- రేవంత్ చెప్పింది నిజమే.. తిరుమలకు మాత్రమే వెళ్లాలని ఎందుకు అనుకోవాలి? యాదగిరి గుట్టకు వెళితే సరిపోతుంది కదా? అని అనుకోవచ్చు. ఆ మాటకొస్తే యాదగిరి గుట్టకైనా సరే ఎందుకు వెళ్లాలి.

దేవుడు సర్వాంతర్యామి అని మన సనాతన ధర్మమే చాలా గాఢంగా ప్రబోధిస్తుంది కదా.. మన ఇంట్లో ఉన్న పూజగదిలో చిత్తశుద్ధితో నమస్కరిస్తే సరిపోతుంది కదా.. ఒక భిన్నమైన వాతావరణాన్నే గనుక కోరుకుంటే మన కాలనీలో ఉన్న చిన్న గుడికి వెళ్లినా సరిపోతుంది కదా.. అనే తరహా వితండ వాదాలు.. ఒకదానికి కొనసాగింపుగా మరొకటి ఎన్ని వాదనలైనా లేవదీయవచ్చు. కానీ.. అదంతా వర్కవుట్ కాదు.

ఇలాంటి సూటిపోటి మాటలు చెప్పే బదులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా హుందాగా ఇంకో తరహాలో మాట్లాడి ఉండవచ్చు. ‘ఇప్పుడు మనం కోరి తెలంగాణ తెచ్చుకున్నాం.. మనం దైవదర్శనాలకు వెళుతున్నప్పుడు ప్రోటోకాల్ మర్యాదలు కావాలనుకుంటే.. మన రాష్ట్రంలో ఉన్న ఆలయాలనుంచి మాత్రమే ఆశించాలి. ఒకప్పుడు కలిసి ఉన్నప్పటికీ తిరుమల మరో రాష్ట్రంలో ఉన్నట్టే. మనం వారణాశి వెళితే.. ఎలాంటి దర్శనానికి వెళ్లడాన్ని ఎంచుకుంటామో.. తిరుమల విషయంలో కూడా అలాగే ఉండాలి. అక్కడ మన ప్రోటోకాల్ మర్యాదలు కావాలనుకోవడం సబబు కాదు. సామాన్యుల్లాగానే దర్శనానికి వెళ్లాలి.. లేదా ఏపీ ప్రభుత్వంలోని వారినుంచి సిఫారసు ఉత్తరం తీసుకుని ప్రోటోకాల్ దర్శనానికి వెళ్లాలి’ అని చెప్పి ఉంటే ఆయన మాటలు చాలా హుందాగా ఉండేవి.

కానీ.. తిరుమలను యాదగిరి గుట్టను పోలుస్తూ.. మనం మనగుడులకు వెళితే చాలు అన్నట్టుగా రేవంత్ మాట్లాడడం సబబుగా లేదు.

13 Replies to “రేవంత్ రెడ్డి తిరుమల వెళ్లడం మానేస్తారా?”

  1. అడుక్కోవడం ఎక్కడ వుంది రేవంతన్న?జబర్దస్త్ గా recommand చేస్తున్నారు…టీటీడీ అనుమతిస్తుంది.. ఇంకెంది సమస్య..భక్తుల నమ్మకాలు..మనోభావాలు ..ఇష్ట దైవాలు కి సంబంధించిన వ్యవహారాలు.. కొంచం దుందుడుకు మాటలు తగ్గిస్తే మీకే మంచిది..పాలకులు సొంత ఇగో లు కంట్రోల్ లో ఉంచుకొని విశాలదృక్పధం తో ఉండాలే.

  2. వినాశ కాలే విపరీత బుద్ధి…వెంకన్న దర్శనం అక్కర్లేదు, US , యూకే వీసాలు అడుక్కుంటాము అంతేనా?

  3. ఇందులో బకరాలు సామాన్య ప్రజలు వాళ్ళు తిరుపతి మాది అని చెప్పుకోలేరు కానీ తెలంగాణా రాజకీయనాయకులు మాత్రం వాళ్ళ ప్రోటోకాల్ మర్యాదలు చేయించుకుంటున్నారు.

  4. రేవంతన్నకు ఏదో అయింది. తెలివితేటలు ఎక్కువైన మాటలు. టీటీడీ అనేది అందరికీ చెందినది. మీ mla లకు పెద్ద పెద్దలకు ప్రోటోకాల్ దర్శనాలు కు ఇబ్బంది వస్తుందని మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వద్దు అనడం ఎంత అవివేకం. పైపెచ్చు వేంకటేశ్వర స్వామి దర్శనం మామూలుగా జరగాలి అని కోరుకోవాలి. మా ఆంధ్రాలో 98% ఆ మాటకొస్తే 99% జనం మామూలుగానే దర్శనాలు చేసుకుంటారు. మీ రిచ్ people కి వెంటనే దర్శనాలు అవ్వాలని తెలివి లేని మాటలు ఆడారు. కొంచెం ఆలోచించండి. ఒక్కడే తిరుమల వెంకన్న సామి యావత్తు దేశం కు. ఆపద మొక్కల వాడు,🙏🙏

  5. అయినా ఈ వెధవ కి మాములు భక్తుల్లాగా వెళ్లి కూడా దర్శనం చేసుకోవచ్చు అనే ఆప్షన్ ఎందుకు తట్టలేదో? బహుశా అధికార మదం ఈ దేశం లో నాయకులకి పూర్తిగా తలకెక్కింది. దేవుడి ముందు కూడా నేనే విఐపి ని అని ఫీల్ అవుతారు

  6. తిరుమల కు వచ్చే భక్తులతో అత్యధికులు తమిళులు, కన్నడిగులు వారేమీ ప్రత్యేక మర్యాదలు ఆశించడం లేదే.

  7. As a common man there is no need to get permission to visit any temple in either of the states. Then let’s come to the point. If one wants to avail

    VIP treatment and darshan, do you contact somebody related to the temple for permission or and you just simply go and expect VIP treatment??

    Think twice before making comments that make no sense . If am Amdhra person wants to visit Yadagiri Gutta as a VIP, then this person has to get permission from the devasthanam to avail such treatment and can’t expect any automatic.

    Enough is enough to stir up differences between …..

  8. కుక్కా గారూ,

    మీ మాటలు వినగానే, మీరు మానవత్వాన్నే మరిచి ఓ అజ్ఞాత రికార్డుకోసం పరుగులు పెడుతున్నట్టు అనిపిస్తోంది. ఒక పార్టీకి మద్దతు అంటూ తల్లులను అవమానించడమంటే, నువ్వు తిట్టు తిట్టిదాకా ‘బెస్ట్ వల్గర్ స్పీకర్’ అవార్డు అందుకునేందుకు రెడీగా ఉన్నట్టు ఉంది. మేము గుర్తించాలంటే తప్ప, తల్లిదేవోభవను తిడుతూ మీ అందరికీ మరింత వినోదం పంచాలనుకుంటున్నట్టుగా అనిపిస్తోంది.

    ఇంకా, తల్లులను తిట్టే వల్గర్ ప్రదర్శనతో “వల్గర్ బ్యాచ్”లో ఒక శాశ్వత సభ్యత్వం సంపాదించాలనుకుంటున్నారా? లేక మీరు మద్దతిచ్చే పార్టీ అధ్యక్షుడి దగ్గరికి వెళ్లి ఏదైనా ‘బిల్లు తూగే గోల్డ్ మెడల్’ పట్టు కొట్టాలనుకుంటున్నారా? ఈ తిట్ల మోతను కొనసాగిస్తే, ముందు మీరు వంకర తాళ్లతో మీ మనసునే అవమానించుకుంటారు. తర్వాత ఈ అప్రతిష్ఠ వల్ల మీ తల్లిదండ్రులే పెద్దగా సిగ్గుపడాల్సిన పరిస్థితి వస్తుంది.

    తల్లిని గౌరవించాలనే తత్త్వమే మానవత్వానికి అంకురార్పణ, కానీ మీరు ఇక్కడ అందరి ముందూ అన్యాపదేశంగా వల్గర్ డైలాగులు విసురుతూ, మీకే మరిణాలన్నట్టుగా ఉంది. మీరు సోలోగా అరుస్తుంటే, మిగిలినవాళ్లను ఓవర్ ఫ్రీ ఎంటర్టైన్ చేస్తున్నట్టే అనిపిస్తోంది. చివరకు మీకు మిగిలేదేమిటంటే, మీ నోటి మాటల మంటలో చరిష్ఠాతపానికి గురవడం మాత్రమే.

    అంటూ, దేవుని దయతో ఇప్పటికైనా మారాలని నేను కోరుకుంటున్నాను. లేనిపక్షంలో, మీ ప్రవర్తనని చూసుకుని మిగిలినవాళ్లు నవ్వుకుని పోతారే కానీ, మీ పరువు మాయం అవ్వడం ఖాయం. ఒకవేళ మర్చిపోవాలనుకుంటే ఈ మాటలు మానేసి, తల్లికి సరైన గౌరవం ఇచ్చే మార్గాన్ని ఎంచుకోండి

Comments are closed.