బాబు అసెంబ్లీకి వెళ్ల‌కుండా జీతం తీసుకోలేదా?

అసెంబ్లీకి వెళ్ల‌ని జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి క‌నీసం ప్ర‌భుత్వం నుంచి జీతం తీసుకోలేద‌ని అయ్య‌న్న‌పాత్రుడే చ‌ట్ట‌స‌భ‌లో చెప్పారు. మ‌రి చంద్ర‌బాబు సంగ‌తేంటి?

వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి మిన‌హా, మిగిలిన ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండానే జీతాలు తీసుకుంటున్న‌ట్టు స్పక‌ర్ అయ్య‌న్న‌పాత్రుడు చెప్పారు. జీతాలు తీసుకుంటూ డ్యూటీకి రాని వారిని ఏమ‌నాలి? ప్ర‌భుత్వ ఉద్యోగులు ఇలాగే విధుల‌కు రాక‌పోతే వారిని ఏం చేస్తాం? అని అసెంబ్లీ వేదిక‌గా స్పీక‌ర్ ప్ర‌శ్నించారు. స‌స్పెండ్ చేస్తామ‌ని కూట‌మి ప్ర‌జాప్ర‌తినిధులు ముక్త కంఠంతో స‌మాధానం ఇచ్చారు.

ప్ర‌జాప్ర‌తినిధులు ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై గ‌ళం విప్ప‌డానికే చ‌ట్ట‌స‌భే స‌రైన వేదిక‌. అసెంబ్లీ స‌మావేశాల‌ను స‌ద్వినియోగం చేసుకోవాలి. స్పీక‌ర్ అంటే, ఏ ఒక్క పార్టీకో చెందిన వ్య‌క్తి కాదు. అంద‌రినీ స‌మాన దృష్టితో చూడాలి. అయితే ఇటీవ‌ల కాలంలో స్పీక‌ర్ల తీరు ఎలా వుంటున్న‌దో ప్ర‌త్యేకంగా మాట్లాడుకోవాల్సిన ప‌నిలేదు. వాళ్ల గురించి ఎంత త‌క్కువ మాట్లాడుకుంటే అంత గౌర‌వం అనుకునే ప‌రిస్థితి.

త‌న భార్య‌ను చ‌ట్ట‌స‌భ‌లో అవ‌మానించార‌ని ఆవేద‌న‌తో చంద్ర‌బాబునాయుడు అసెంబ్లీ స‌మావేశాల్ని బ‌హిష్క‌రించిన సంగ‌తి తెలిసిందే. తిరిగి ముఖ్య‌మంత్రిగానే చ‌ట్ట‌స‌భ‌లో అడుగు పెడ‌తాన‌ని ఆయ‌న ప్ర‌తినబూని, అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు. అసెంబ్లీ స‌మావేశాల‌కు రెండేళ్ల‌కు పైగా గైర్హాజ‌రైన చంద్ర‌బాబునాయుడు జీతం తీసుకున్నారా? లేదా? ….ఈ విష‌యాన్ని స్పీక‌ర్ అయ్య‌న్న‌పాత్రుడు తేల్చాల్సిన అవ‌స‌రం వుంది.

అసెంబ్లీకి వెళ్ల‌ని చంద్ర‌బాబు, జీతం మాత్రం ల‌క్ష‌ణంగా తీసుకున్నార‌ని వైసీపీ నేత‌లు చెబుతున్నారు. అదే నిజ‌మైతే , అయ్య‌న్న‌పాత్రుడికి కామెంట్స్ ఎవ‌రికి వ‌ర్తిస్తాయో చెప్పాలి. అసెంబ్లీకి వెళ్ల‌ని జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి క‌నీసం ప్ర‌భుత్వం నుంచి జీతం తీసుకోలేద‌ని అయ్య‌న్న‌పాత్రుడే చ‌ట్ట‌స‌భ‌లో చెప్పారు. మ‌రి చంద్ర‌బాబు సంగ‌తేంటి? గ‌త వైసీపీ హ‌యాంలో అసెంబ్లీ స‌మావేశాల‌కు వెళ్ల‌కుండానే చంద్ర‌బాబు జీతం తీసుకున్నార‌నే ఆరోప‌ణ‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో, ఎథిక్స్ క‌మిటీతో విచార‌ణ చేయించాల్సిన బాధ్య‌త స్పీక‌ర్‌పై వుంది.

17 Replies to “బాబు అసెంబ్లీకి వెళ్ల‌కుండా జీతం తీసుకోలేదా?”

  1. వాళ్ళు వెళ్ళలేదు కదా .. వాళ్ళు జీతం తీసుకోలేదా కాదు .. మనకి మనం గొప్ప చెప్పుకుంటాము కదా .. మనం ఎందుకు వెళ్లడం లేదో .. దానికి చెప్పు సమాధానం ..

  2. ఈ పది మంది MLA లు ఎంతో కస్టపడి, వాళ్ళ సొంత భలం తో గెలిచి, వాళ్ళ నియోజకవర్గ సమస్యలని అసెంబ్లీ లో లేవనెత్తి వాటికి పరిష్కారం చూపాలని, ఎన్నో ఆశలతో ఎదురుచూస్తుంటే ఈ ‘సైకో గాడు, వాడి స్వార్థం కోసం మిమ్మల్ని కట్టడి చేస్తూ, దొంగలుగా మారుస్తున్నాడు, మీ ప్రజలని మోసం చేస్తున్నాడు.. Its టైం to REVOLT for a better cause.

  3. బాబు తనకి జరిగిన అవమానననికి బాధతో వెళ్ళలేదు…జగన్ తనకు హోదా ఇవ్వలేదని వెళ్ళలేదు, రెంటికి తేడా ఉంది. బాబు వెల్లకపోయిన మిగతా mla విధులకు అడ్డం రాలేదు.జగన్ తాను చెడింది కాక మిగతా వారి హక్కు కూడా దొబ్బేసాడు… బోథ్ ఆర్ నాట్ సే మ్

    1. అవమానం వాడికి జరిగిందని .. ప్రజలకేదో అవమానం జరిగినట్టు అసెంబ్లీ కి వెళ్లకుండా ఉంటె ఎలా? రెండు ఒక్కటే..!

      1. జనాలు గెలిపిస్తే అయిన మళ్ళీ వెళ్ళాడు .. జనాలు వొడిస్తే ఈయన ఇంట్లో కూర్చున్నాడు .. రెండు ఒకటే కూరెక్ట్ ..

  4. వైసీపీ లో ఉండి పోటీచేయకుండా ఇండిపెండెంట్ లు గ పోటీ చేస్తే బొత్స లాంటోళ్ళు గెలుద్దురు కనీసం ప్రతిపక్ష హోదా పొందే లాగైనా గెలుద్దురు

Comments are closed.