పూరి.. సేతుపతి.. కాంబో?

ఇటీవలే పూరి చెన్నయ్ వెళ్లి విజయ్ సేతుపతికి కథ చెప్పి వచ్చారు. కథ ఓకె అయింది.

లైగర్, డబుల్ ఇస్మార్ట్ లాంటి దారుణమైన సినిమాలు అందించి, బయ్యర్లను కుదేలు చేసేసారు దర్శకుడు పూరి జగన్నాధ్. సినిమాలు ఎదురెళ్లి కొనక్కున్న బయ్యర్లు కక్కలేక మింగలేక బాధపడుతున్నారు. ఇది నిర్మాతల వైపు. రెండు ఫ్లాపుల తరువాత పూరికి సినిమా ఎలా? అయితే పూరి ట్రాక్ రికార్డు. క్రేజ్ వుండనే వుంది. అందుకే ఇప్పుడు మరో సినిమా చేతిలోకి వచ్చేలా కనిపిస్తోంది.

ఇటీవలే పూరి చెన్నయ్ వెళ్లి విజయ్ సేతుపతికి కథ చెప్పి వచ్చారు. కథ ఓకె అయింది. ఇక మిగిలిన టెర్మ్స్ అన్నీ సెట్ కావాలి. మళ్లీ స్వంత నిర్మాణమా? లేక వేరే బ్యానర్ నా అన్నది చూడాలి.

నిజానికి ఇప్పుడు వేరే బ్యానర్ అయితెేనే బెటర్. ఎందుకంటే స్వంత బ్యానర్ అయితే పాత లెక్కలు అన్నీ అడ్డం పడతాయి. ఈసారి కాస్త గట్టిగా పట్టుకుంటారు. అదే మైత్రీ, ఇంకా ఇలాంటి పెద్ద బ్యానర్ లు అయితే ఎవరూ అడ్డం పడే వీలు వుండదు.

ఈ మేరకు కొంత మంది నిర్మాతలతో చర్చలు సాగుతున్నాయి. అన్నీ ప్రాధమిక దశలో వున్నాయి. వన్స్ అవి పూర్తయితే అనౌన్స్ మెంట్ వస్తుంది. ఇది కాక మరో భారీ సినిమా కథ కూడా పూరి రెడీ చేసారు. అది కూడా ఆలోచనల్లో వుంది.

4 Replies to “పూరి.. సేతుపతి.. కాంబో?”

Comments are closed.