పటాస్ రివర్స్ చేసిన కథ

సినిమా గురించి హీరో కళ్యాణ్ రామ్ చెబుతున్న సంగతులు విన్నా, గతంలో చేసిన పటాస్ కథను రివర్స్ చేసినట్లు కనిపిస్తోంది.

కాస్త గ్యాప్ తరువాత హీరో కళ్యాణ్ రామ్ చేస్తున్న సినిమా అర్జున్ సన్నాఫ్ వైజయంతి. ఈ సినిమా టీజర్ విడుదల చేసారు. చాలా అంటే చాలా గ్యాప్ తరువాత సీనియర్ హీరోయిన్ విజయశాంత్ పోలీస్ యూనిఫారమ్ వేసుకుని చేసిన సినిమా. సినిమా టీజర్ చూసినా, సినిమా గురించి హీరో కళ్యాణ్ రామ్ చెబుతున్న సంగతులు విన్నా, గతంలో చేసిన పటాస్ కథను రివర్స్ చేసినట్లు కనిపిస్తోంది.

కళ్యాణ్ రామ్ కెరీర్ లో పటాస్‌ అతి పెద్ద హిట్. తండ్రీ కొడుకు ఇద్దరూ పోలీస్ ఆఫీసర్లే. తండ్రి అంటే కొడుకు సరిపడదు. కానీ తండ్రికి కొడుకు అంటే ఇష్టం. వీటిక ఓ రీజన్ వుంటుంది. తండ్రీ కొడుకుల సెంటిమెంట్ సినిమా ఇది.

ఇప్పుడు ఈ సినిమా విషయానికి వస్తే తల్లి వైజయంతి పోలీస్ ఆఫీసర్. కొడుక్కు తల్లంటే ప్రేమ. కానీ తల్లికి కొడుకు అంటే కోపం. అది ఎందుకో సినిమా చూస్తే కానీ తెలియదు. ఇక్కడ కొడుకు పోలీస్ ఆఫీసర్ కావాలన్నది తల్లి కోరిక. అది నెరవేరిందా లేదా అన్నది సినిమాలో చూడాలి.

ఇలా మొత్తం మీద చూసుకుంటే అటు తిప్పి ఇటు తిప్పి పటాస్ సినిమాను మళ్లీ తీస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే పటాస్ వున్న ఎంటర్ టైన్ మెంట్ వేరు. ఆ రేంజ్ ఎంటర్ టైన్ మెంట్ ఈ సినిమాలో వుందో లేదో ట్రయిలర్ వస్తే కానీ తెలియదు. చిలుకూరి ప్రదీప్ దర్శకుడు. శ్రీకాంత్ విస్సా స్క్రీన్ ప్లే.

టీజర్ లో సీనియర్ హీరోయిన్ విజయశాంతి ఫైట్లు బాగున్నాయి. సినిమా మొత్తం ఎమోషన్ లైన్ లో రన్ అవుతుందనే హింట్ ఇచ్చారు.

5 Replies to “పటాస్ రివర్స్ చేసిన కథ”

Comments are closed.