దావోస్ వేదికగా తెలంగాణకు పెట్టుబడులు వెల్లువెత్తాయి. మొత్తం రూ.1.30 లక్షల కోట్లకు పైగా పెట్టుబడుల్ని పెట్టేందుకు పది పారిశ్రామిక సంస్థలు రేవంత్‌రెడ్డి సర్కార్‌తో ఒప్పందాలు చేసుకున్నట్టు సమాచారం. తెలంగాణ ఏర్పడిన తర్వాత అత్యధికంగా పెట్టుబడులు రావడం ఇదే మొదటిసారి అని చెబుతున్నారు. బుధవారం ఒక్కరోజే రూ.56 వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టే సంస్థలతో ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే.
తాజాగా ప్రతిష్టాత్మక అమెజాన్ సంస్థ కూడా తెలంగాణలో రూ.60 వేల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం విశేషం. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో అమెజాన్ ఎంవోయూ కుదుర్చుకుంది. డేటా సెంటర్లలో అమెజాన్ పెట్టుబడులు పెట్టనుంది. ఇప్పటికే అమెజాన్ ఒక బిలియన్ పెట్టుబడులతో మూడు సెంటర్లను పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా మరింతగా విస్తరణ కోసం అమెజాన్ ముందుకొచ్చింది.
అలాగే మరో దిగ్గజ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ కూడా తెలంగాణలో విస్తరించనుంది. 17 వేల ఉద్యోగాలు అదనంగా కల్పించేందుకు క్యాంపస్‌ను విస్తరించేందుకు తెలంగాణ ప్రభుత్వంతో ఇన్ఫోసిస్ ఎంవోయూ కుదుర్చుకుంది.
ఇప్పటికే హైదరాబాద్ ఐటీ రంగంలో రోజురోజుకూ అభివృద్ధి చెందుతోంది. మరింతగా విస్తరించడానికి దావోస్‌లో ఒప్పందాలు చేసుకోవడం విశేషం. దీంతో రేవంత్‌రెడ్డి సర్కార్ పరిశ్రమల స్థాపనలో పాజిటివిటీని దక్కించుకుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Kammaravati lo khalee leka Hyderabad ki vellayemo pettubdulu
Jangan goru jaail
మా పవన్ వెళ్ళింటే ఇప్పటికే 5 లక్షల కోట్లు పెట్టుబడి వచ్చేది.. మా బ్రాండ్ అలాంటిది
ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు
తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ