సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావు మరోసారి సవాల్ విసిరాడు. గతంలో రుణ మాఫీ మీద సవాల్ చేశాడు. చెప్పిన తేదీకి రుణ మాఫీ చేస్తే తాను పదవికి రాజీనామా చేస్తానని, రుణ మాఫీ చేయకపోతే రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని అంటూ రాజీనామా పత్రాన్ని జేబులో పెట్టుకుని తిరిగాడు.
రుణ మాఫీ పూర్తయిందని ప్రభుత్వం చెబుతుండగా, అందరి రైతులకు రుణమాఫీ చేయలేదని కేటీఆర్, హరీష్ రావు ఇతర గులాబీ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఆ సంగతి నిరూపిస్తామని కూడా అంటున్నారు. ఇక జనవరి 26 నుంచి ప్రభుత్వం పలు పథకాలను అమలు చేయబోతున్నది.
రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లను పంపిణీ చేయనుంది. దాని కోసం గ్రామ సభలు నిర్వహిస్తోంది. అయితే అర్హులకు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వడంలేదని గ్రామ సభల్లో ప్రజలు తీవ్రంగా ఆగ్రహిస్తున్నట్లు, అధికారులను, కొన్ని చోట్ల మంత్రులను నిలదీస్తున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.
కేసీఆర్ పత్రిక “నమస్తే తెలంగాణ”లో అయితే ప్రతిరోజూ ఇవే వార్తలు పుంఖాను పుంఖాలుగా ప్రచురిస్తోంది. “సర్కారుపై పోరు… దద్దరిల్లే ఊరు” శీర్షికతో కేవలం ఫోటోలతో రెండు మూడు పేజీలు ప్రచురిస్తోంది. మిగతా పత్రికల్లో ప్రభుత్వ వ్యతిరేకతపై వార్తలు రావడంలేదు. రేవంత్ రెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే గ్రామ సభలకు రావాలని హరీష్ రావు సవాల్ విసిరాడు.
అయితే ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్న మాట వాస్తవమే. దరఖాస్తుల పేరుతో ప్రభుత్వం మోసం చేస్తోందని అన్నాడు. దరఖాస్తు పెట్టినప్పుడల్లా నలభై రూపాయలు ఖర్చవుతున్నాయని అన్నాడు. ‘సీఎం రేవంత్ సిద్ధిపేటకు వస్తారా… లేకపోతే ఆయన గ్రామం కొండారెడ్డిపల్లికి పోదామా చెప్పాలి. రుణమాఫీ అయిందో లేదో చూద్దాం’ అని హరీష్ రావు అన్నాడు.
రుణ మాఫీ మీద వైట్ పేపర్ విడుదల చేయాలని డిమాండ్ చేశాడు. వానాకాలం రైతు బంధు ఎప్పుడిస్తారో చెప్పాలన్నాడు. “ఎనుముల రేవంత్ రెడ్డి కాదని ఎగవేతల రేవంత్ రెడ్డి” అని విమర్శించాడు. ఇకనుంచి అలాగే పిలుస్తామన్నాడు. ఇంకా చాలా విమర్శలు చేశాడు. మరి హరీష్ రావు సవాల్‌ను రేవంత్ రెడ్డి స్వీకరిస్తాడో లేదో తెలియదు.
mundu ee lan** k0dukuni chepputo k0ttali
ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు
తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ