అట్లీ కథ కూడా భారీనే!

అటు అట్లీ, ఇటు త్రివిక్రమ్- రెండు సినిమాలు కనుక పారలల్‌గా చేస్తే త్రివిక్రమ్ సినిమానే ముందు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇప్పటికే తన కెరీర్‌లో చాలా లేట్ అయింది. పుష్ప రెండు భాగాలకు చాలా కాలం వెచ్చించాల్సి వచ్చింది. అందుకే వీలైనంత త్వరగా ఓ సినిమా చేసేయాలని ప్రయత్నిస్తున్నారు. ముందుగా అనుకుని, త్రివిక్రమ్‌తో ప్లాన్ చేసిన భారీ సినిమాతో పాటు అట్లీ సినిమాను కూడా చేయాలని ప్రయత్నిస్తున్నారు.

త్రివిక్రమ్ తయారు చేసింది భారీ మైథలాజికల్ టచ్ ఉన్న కథ. దానికి ప్రీ-ప్రొడక్షన్, ప్రొడక్షన్, పోస్ట్-ప్రొడక్షన్ కలిపి కనీసం ఏడాదిన్నర నుంచి రెండేళ్లు పడుతుందని అంచనా.

అంతా ఏమనుకుంటున్నారంటే అట్లీ సినిమా చకచకా అయిపోతుంది, 2026 చివరకు అయినా విడుదలకు రెడీ అవుతుంది అని. కానీ వినిపిస్తున్న విషయం వేరుగా ఉంది. అట్లీ సినిమా కూడా భారీదేనట. కథ మాత్రమే భారీ కాదు, సినిమా ప్రొడక్షన్, సీజీ వర్క్‌లు, ఇలాంటివి అన్నీ చాలా టైమ్ పట్టేవే అని తెలుస్తోంది.

ఇలా తీసేసి, అలా విడుదల చేసేంత అయితే కాదు. అటు అట్లీ, ఇటు త్రివిక్రమ్- రెండు సినిమాలు కనుక పారలల్‌గా చేస్తే త్రివిక్రమ్ సినిమానే ముందు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇంతకీ లెక్కలు తేలాలి, పారితోషికాలు ఫిక్స్ కావాలి. అప్పుడు అనౌన్స్‌మెంట్… సినిమాలు స్టార్ట్ కావడం. ఇప్పుడు బన్నీతో సినిమా అంటే అంత వీజీ కాదు. ఎందుకంటే వెయ్యి కోట్ల మార్కెట్ అన్నది ఒకటి ఫిక్స్ అయిపోయింది కదా?

7 Replies to “అట్లీ కథ కూడా భారీనే!”

Comments are closed.