తెలంగాణ ప్ర‌జాప్ర‌తినిధుల సిఫార్సు లేఖ‌ల‌పై టీటీడీ స్ప‌ష్ట‌త‌

ఒక్కో ప్ర‌జాప్ర‌తినిధి సిఫార్సు లేఖ‌పై ఆరుగురికి ద‌ర్శ‌నం క‌ల్పిస్తామ‌ని టీటీడీ తెలిపింది.

తెలంగాణ ప్ర‌జాప్ర‌తినిధుల సిఫార్సు లేఖ‌ల‌పై ఎట్ట‌కేల‌కు టీటీడీ స్ప‌ష్ట‌త ఇచ్చింది. ఇక‌పై ప్ర‌తి సోమ‌, మంగ‌ళ‌వారాల్లో వీఐపీ బ్రేక్‌, అలాగే బుధ‌, గురువారాల్లో రూ.300 (సుప‌థం) ద‌ర్శ‌నాలు క‌ల్పిస్తామ‌ని టీటీడీ స్ప‌ష్టం చేసింది. ఒక్కో ప్ర‌జాప్ర‌తినిధి సిఫార్సు లేఖ‌పై ఆరుగురికి ద‌ర్శ‌నం క‌ల్పిస్తామ‌ని టీటీడీ తెలిపింది. ఈ ద‌ర్శ‌నాల‌ను 24వ తేదీ నుంచి అమ‌లు చేయ‌నున్న‌ట్టు టీటీడీ అధికారులు వెల్ల‌డించారు.

తెలంగాణ ప్ర‌జాప్ర‌తినిధుల సిఫార్సు లేఖ‌ల‌కు ద‌ర్శ‌నాలు క‌ల్పించాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞ‌ప్తి మేర‌కు సీఎం చంద్ర‌బాబు సానుకూలంగా స్పందించారు. తెలంగాణ ప్ర‌జాప్ర‌తినిధుల లేఖ‌ల‌కు ద‌ర్శ‌నాలు క‌ల్పించాల‌ని టీటీడీ ఉన్న‌తాధికారుల‌ను సీఎం చంద్ర‌బాబు ఆదేశించారు. అయితే ఆయ‌న ఆదేశాలు అమ‌లుకు నోచుకోక‌పోవ‌డంపై తెలంగాణ దేవాదాయ‌శాఖ మంత్రి కొండా సురేఖ మరోసారి సీఎం బాబుకు లేఖ రాశారు.

అలాగే బీజేపీ ఎంపీ ర‌ఘునంద‌న్‌రావు రెండు రోజుల క్రితం తిరుమ‌ల ద‌ర్శ‌నానికి వెళ్లారు. త‌మ రాష్ట్ర ప్ర‌జాప్ర‌తినిధుల సిఫార్సు లేఖ‌ల్ని తీసుకోక‌పోవ‌డంపై ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇలాగైతే తామంతా తిరుమ‌ల‌కు వ‌చ్చి ధ‌ర్నా చేస్తామ‌ని హెచ్చ‌రించారు. దీంతో టీటీడీ అధికారులు దిగొచ్చారు. తెలంగాణ ప్ర‌జాప్ర‌తినిధుల సిఫార్సు లేఖ‌ల‌పై ద‌ర్శ‌నాల్ని ఎప్పుడు, ఎలా అనుమ‌తిస్తారో స్ప‌ష్ట‌త ఇవ్వ‌డం విశేషం.

10 Replies to “తెలంగాణ ప్ర‌జాప్ర‌తినిధుల సిఫార్సు లేఖ‌ల‌పై టీటీడీ స్ప‌ష్ట‌త‌”

  1. Y.-.C.-.P అధికార ప్రతినిధి శ్యామల గారు డబ్బు కోసం కక్రుత్తి పడి బెట్టింగ్ Apps ప్రమోట్ చెస్తునందుకు ఈమె పైన తెలంగాణ పొలీసులు కే.-.సు రిజిస్టర్ చెసారు అని వార్థలు వస్తున్నాయి!

    .

    పాపం GA కి మాత్రం కనపడదు, వినపడదు. ఈ వార్త రాయడు!

  2. ఈ తెలంగాణ నాయుకులుకే విప్ దర్సనం ఇవ్వటమే ఎక్కువ . మల్లి వేళ్ళ సిఫర్సు చేసిన వాళ్ళను కూడా allow చెయ్యాలా ? ఇలా అయితే ప్రతి రాష్ట్ర ప్రజా నాయకుల సిఫార్సు లేఖలు తీసుకుంటార ? ఏ మతం లో లేని ఈ విప్ దర్శనాలు , ఎందుకు హిందూ మతం లోనే వున్నాయ్. దేవుడు దగ్గర ప్రజలు అందరూ సమానం కాదా ?

  3. ఈ తె*లం.గాణ నాయుకులుకే వి..ప్ దర్సనం ఇవ్వటమే ఎక్కువ . మల్లి వేళ్ళ సిఫర్సు చేసిన వాళ్ళను కూడా allow చెయ్యాలా ? ఇలా అయితే ప్రతి రాష్ట్ర ప్రజా నాయకుల సిఫార్సు లేఖలు తీసుకుంటార ? ఏ మతం లో లేని ఈ వి*ప్ దర్శనాలు , ఎందుకు హిం@. దూ మతం లోనే వున్నాయ్. దేవుడు దగ్గర ప్రజలు అందరూ సమానం కాదా ?

  4. ఈ తె* లం .గాణ నాయుకులుకే వి..ప్ ద /ర్సనం ఇవ్వటమే ఎక్కువ . మల్లి వేళ్ళ సిఫర్సు చేసిన వాళ్ళను కూడా al.low చెయ్యాలా ? ఇలా అయితే ప్రతి రా/ష్ట్ర ప్ర/జా నాయకుల సి.ఫా.ర్సు లేఖలు తీసుకుంటార ? ఏ మతం లో లేని ఈ వి*ప్ దర్శనాలు , ఎందుకు హిం.@. దూ మతం లోనే వున్నాయ్. దే.వు.డు దగ్గర ప్రజలు అందరూ సమానం కాదా ?

  5. ఈ తె* లం .గాణ నాయుకులుకే వి..ప్ ద /ర్సనం ఇవ్వటమే ఎక్కువ . మల్లి వేళ్ళ సిఫర్సు చేసిన వాళ్ళను కూడా al.low చెయ్యాలా ? ఇలా అయితే ప్రతి రా/ష్ట్ర ప్ర/జా నాయకుల సి.ఫా.ర్సు లేఖలు తీసుకుంటార ?

    1. ఏ మతం లో లేని ఈ వి*ప్ దర్శనాలు , ఎందుకు హిం.@. దూ మతం లోనే వున్నాయ్. దే.వు.డు దగ్గర ప్రజలు అందరూ సమానం కాదా ?

    2. ఏ మ /.తం. లో లేని ఈ వి/*ప్ దర్శనాలు , ఎందుకు హిం.@. దూ మతం లోనే వున్నాయ్. దే.వు. డు దగ్గర ప్రజలు అందరూ సమానం కాదా ?

    3. ఎక్కడ లేని ఈ వి/*ప్ దర్శనాలు , ఎందుకు హిం దు వు లు లోనే వున్నాయ్. దే.వు. డు దగ్గర ప్రజలు అందరూ సమానం కాదా ?

Comments are closed.