కామెడీ పొలిమేర దాటిన అల్లరి

సేమ్ టైమ్ కేవలం హర్రర్ జానర్ అని కాకుండా సైకో థ్రిల్లింగ్ పాయింట్ కూడా సినిమా వుంటుంది అన్న హింట్ ఇచ్చారు.

అల్లరి నరేష్ అంటే కేవలం కామెడీ అనుకున్నారా అని క్వశ్చన్ చేస్తూ చాలా సార్లు వైవిధ్యమైన సినిమాలు చేస్తూ, చూపిస్తూ వస్తున్నారు. ఈ మధ్య వచ్చిన బచ్చలమల్లి కూడా ఎంటర్ టైన్ మెంట్ కాకుండా ఎమోషనల్ టచ్ మీద వెళ్లారు. ఇప్పుడు మరో లేటెస్ట్ సినిమా అనౌన్స మెంట్ గ్లింప్స్ వచ్చింది. 12 ఎ. రైల్వే కాలనీ అన్నది టైటిల్. పొలిమేర వన్ అండ్ టూ అందించిన డాక్టర్ అనిల్ విశ్వనాధ్ ఈ సినిమాకు షో రన్నర్. నాని కాసరగడ్డ దర్శకుడు. చిట్టూరి శ్రీను నిర్మాత.

టైటిల్ గ్లింప్స్ అనౌన్స్ మెంట్ లోనే ఇది హర్రర్ జానర్, ప్రేతాత్మలు, వాటి వైనాలు అన్నది క్లారిటీ ఇచ్చేసారు. అయితే సేమ్ టైమ్ కేవలం హర్రర్ జానర్ అని కాకుండా సైకో థ్రిల్లింగ్ పాయింట్ కూడా సినిమా వుంటుంది అన్న హింట్ ఇచ్చారు. అల్లరి నరేష్ కు సైకో థ్రిల్లర్ కొత్త కాదు. కానీ హర్రర్ జానర్ మాత్రం కొత్తే. టైటిల్ గ్లింప్స్ ఆసక్తికరంగానే కట్ చేసారు. భీమ్స్ బ్యాక్ గ్రవుండ్ స్కోర్ దానికి తగినట్లే వుంది.

కామెడీ రైటర్లు తగ్గిపోవడం, సరైన కామెడీ స్క్రిప్ట్ లు రాకపోవడంతో అల్లరి నరేష్ రకరకాల పాత్రలు తీసుకుని, రకరకాల స్క్రిప్ట్ లు ట్రయ్ చేస్తూ వెళ్తున్నారు. ఆయనకు అయితే పేరు వస్తోంది. బాగా చేసారని, క్యారెక్టర్ బాగుందని, కానీ స్క్రిప్ట్ లు మాత్రం సరిగ్గా పూల్ ప్రూఫ్ గా సెట్ కావడం లేదు. ఈసారి వర్కవుట్ అయ్యేలా వుంది గ్లింప్స్ చూస్తుంటే.

 

8 Replies to “కామెడీ పొలిమేర దాటిన అల్లరి”

  1. అల్లరి నరేష్ ఆయనకి కొత్తగా ఉండే పాత్రలు చేస్తూ అవి జనానికి కూడా కొత్తదిగా అనిపించెలా ఉండాలి లేకపోతే baccahalamalli results repeat అవుతాయి

  2. ఆల్రెడీ అల్లరి నరేష్…

    ఇంట్లో దెయ్యం నాకేం భయం అనే హార్రర్ సినిమ చేశాడు…

    ఈ వెనకటి రెడ్డి గాడికి జగన్ గాడి భజనలో మిగతా ఏవీ గుర్తున్నట్టు లేదు

Comments are closed.