విజయశాంతి నాన్ వెజ్ మొక్కు

సినిమా పూర్తయి, విడుదలై, హిట్ అయితే తిరుపతి కొండ ఎక్కుతానని, అంత వరకు నాన్ వెజ్ తినను అని మొక్కుకున్నారట.

సినిమా చేసిన తరువాత తిరుపతి కొండ ఎక్కడం అన్నది చాలా మంది సినిమా జనాలకు అలవాటు, నమ్మకం. కానీ ఫ‌ర్ ఏ ఛేంజ్‌, సినిమా స్టార్ట్ కాగానే మొక్కుకున్నారట సీనియర్ హీరోయిన్ విజయశాంతి. నిజానికి, ఇలాంటి మొక్కులు హీరోలు, దర్శకులు లేదా నిర్మాతలు మొక్కుకోవాలి. అయితే, సినిమాలో కీలకపాత్ర చేసిన విజయశాంతి మొక్కుకోవడం విశేషమే.

ఇంతకీ ఆ మొక్కు ఏమిటంటే—సినిమా పూర్తయి, విడుదలై, హిట్ అయితే తిరుపతి కొండ ఎక్కుతానని, అంత వరకు నాన్ వెజ్ తినను అని మొక్కుకున్నారట.

అందుకే కళ్యాణ్ రామ్ ఓ మాట ఇచ్చారు విజయశాంతికి. సినిమా విడుదలైన తరువాత తానే విజయశాంతిని తిరుపతి కొండకు తీసుకెళ్తానని, వచ్చిన తరువాత చేపల పులుసు ప్రత్యేకంగా చేయించి, ఆమెకు ఇస్తానని. దానికి కూడా విజయశాంతి స్పందించారు—కొండకు వెళ్లి వచ్చిన వెంటనే నాన్ వెజ్ తినను, తరువాత తింటా అంటూ. దానికీ సై అన్నారు కళ్యాణ్ రామ్.

వైజయంతి సన్ ఆఫ్ అర్జున్ సినిమా టీజర్ విడుదల వేదిక మీద, కళ్యాణ్ రామ్ విజయశాంతి విషయంలో చాలా మర్యాదగా, అభిమానంగా ప్రవర్తించారు. విజయశాంతిని ముందు మాట్లాడమంటే, అది సరికాదని, ఆమెకు తగిన గౌరవం ఇవ్వాలని భావించి, ఆమెనే ఫైనల్ ప్రసంగం చేయనిచ్చారు. “అమ్మ… అమ్మా” అంటూనే ప్రస్తావిస్తూ వచ్చారు.

8 Replies to “విజయశాంతి నాన్ వెజ్ మొక్కు”

  1. అంటే ముక్క తప్పని సగం ఒప్పుకునట్టే గా…పూర్తిగా మాని మిగతా సగం కూడా వొప్పుకోండి…ఆ దమ్ము ఉండదు …అది ఎవరైనా గానీ….గత 3 యుగాల్లో దేవుళ్ళు కూడా తిన్నారు..అది ధర్మం…ఈ కలిలో తినటం అధర్మం…

  2. వీళ్ళ మొక్కులేంటో , చేపల పులుసు ఎంటో. గోవిందా ఈ సినిమా వాళ్ళ నీ నమ్మొద్దు

  3. కళ్యాణ్ రామ్ మంచి మనిషి, అతని సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను…

Comments are closed.