తెలుగులోకి మార్కో డైరక్టర్

మార్కో సినిమాను అందించిన హనీఫ్ అదేని ని తెలుగు సినిమా కోసం లాక్ చేసారు నిర్మాత దిల్ రాజు.

మలయాళంలో ఇటీవల విడుదలై దేశ వ్యాప్తంగా భారీగా వసూళ్లు సాధించిన సినిమా మార్కో. దాదాపు వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. విపరీతమైన హింస వుందని జనం ఈ సినిమా గురించి కథలు కథలు గా చెప్పుకున్నారు. ఇప్పుడు ఈ సినిమా దర్శకుడు తెలుగులోకి వస్తున్నాడు.

మార్కో సినిమాను అందించిన హనీఫ్ అదేని ని తెలుగు సినిమా కోసం లాక్ చేసారు నిర్మాత దిల్ రాజు. ఆయన వారసులు హన్సిక, హర్షిత్ కలిస స్టార్ట్ చేసిన దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ మీద ఓ సినిమా నిర్మించడానికి అగ్రిమెంట్ కుదిరింది.

ఈ సినిమా మల్టీ స్టారర్. త్వరలో ఎవరు ఎవరు ఆ మల్టీ స్టారర్లు అనే వివరాలు బయటకు వస్తాయి. అన్ని సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ ల్లో ఈ సినిమాను నిర్మించబోతున్నారు. ప్రస్తుతానికి దర్శకుడిని, పాయింట్ ను లాక్ చేసారు. కథ రెడీ కావాలి. స్టార్ కాస్ట్ ఫిక్స్ కావాలి. అప్పుడు అసలు సంగతులు అన్నీ తెలుస్తాయి.

గేమ్ ఛేంజర్ తరువాత తన సెకెండ్ ఇన్నింగ్స్ అనేట్లుగా నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేసుకుంటున్నారు. విజయ్ దేవరకొండ, నితిన్ లతో నిర్మించిన రెండు సినిమాలు విడుదల కావాల్సి వుంది. ప్రభాస్ తో ఓ సినిమా అలాగే అల్లు అర్జున్ తో మరో సినిమా సెట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

2 Replies to “తెలుగులోకి మార్కో డైరక్టర్”

Comments are closed.