అమ్మ కళ్లల్లో ఆనందం కోసం..!

అతడ్ని స్మశానానికి తీసుకెళ్లి మరీ డబ్బు రికవరీ చేశారు. అంతా కలిపి 45 లక్షల రూపాయలు.

అమ్మకు చీర కొనిపెడదాం అనుకున్నాడు ఆ కొడుకు. కానీ డబ్బుల్లేవ్. కష్టపడి సంపాదించాలనే ఆలోచన లేదు. దొంగతనాలు మొదలుపెట్టాడు. తొలి ప్రయత్నం సక్సెస్. అమ్మకు చీర కొన్నాడు. అక్కడితో ఆపేస్తే, పోనీలే కొడుకు సెంటిమెంట్ అనుకోవచ్చు.

కానీ అతగాడు దొంగతనం రుచి మరిగాడు. అంచెలంచెలుగా ఎదిగాడు. ఏకంగా అంతర్రాష్ట్ర గజదొంగగా మారాడు. అమ్మకు చీర కోసం దొంగతనాలు మొదలుపెట్టిన ఆ వ్యక్తి, ఏకంగా లక్షల రూపాయలు కొల్లగొట్టే స్థాయికి చేరాడు. ఇప్పుడు పోలీసులకు చిక్కాడు.

అయితే అతడు పోలీసులకు చిక్కడం కొత్తకాదు. ఇంతకుముందే ఓసారి దొరికిపోయాడు. రాజమండ్రి సెంట్రల్ జైలులో శిక్ష కూడా అనుభవించాడు. ఈసారి ట్విస్ట్ ఏంటంటే, అలా కొల్లగొట్టిన డబ్బును అతడు ఎక్కడ దాస్తున్నాడనే విషయం బయటపడింది.

461 గ్రాముల బంగారు నగలు కొట్టేశాడు. 3 లక్షల నగదు కూడా చోరీ చేశాడు. దీంతో పాటు వెండి కూడా. ఇవన్నీ ఓ స్మశానంలో దాచాడు. అక్కడికైతే ఎవ్వరూ రారు, సేఫ్ అని భావించాడు. అవసరమైనప్పుడల్లా బ్యాంకుకు వెళ్లినట్టు, స్మశానానికి వెళ్లి కావల్సిన డబ్బు తెచ్చుకునేవాడు.

ఈమధ్య కూడా అలానే చేశాడు. కానీ ఓ కానిస్టేబుల్ కంట్లో పడ్డాడు. తప్పించుకోవడానికి అతడిపై దాడి చేశాడు. కానీ తప్పించుకోలేకపోయాడు. అతడ్ని స్మశానానికి తీసుకెళ్లి మరీ డబ్బు రికవరీ చేశారు. అంతా కలిపి 45 లక్షల రూపాయలు. ఆ దొంగ పేరు సురేందర్. ఊరు ఏలూరు జిల్లా చాట్రాయి మండలం దగ్గర ఓ గ్రామం.

7 Replies to “అమ్మ కళ్లల్లో ఆనందం కోసం..!”

  1. నువ్వు చెప్పిన చాట్రాయి నుంచీ kgf వరకు అందరూ అమ్మ కళ్ళల్లో ఆనందాన్ని చూడాలనుకున్నారు

  2. ఇలాంటి వాళ్లను చూసైనా మాడా గాడి డబ్బు పిచ్చి పోయి తల్లి షెల్లీ మీద ప్రేమ కలుగుతుందని ఆశిద్దాం!!

    1. రోజూ.. ఈ B0 గమ్ కబుర్లు.. రాసె బదులు.. రాష్ట్రానికి ఇప్పటివరకు 9 నెలలలో ఏం చేసారు..ఏం చెయ్యబోతున్నారు.. ఎంత అప్పులు ఎంత వడ్డీలకు తెచ్చారు. ఎక్కడెక్కడ ఖర్చుపెట్టారు.. ? ఎక్కడ..,ఈ 9 నెలలలో. సంపద సృష్టిచడం చేసారు.. ఇవి చెప్పండి ర.. ఐటీడీపీ.. LutCH@ గళ్ళార..! అసలుసిసలు.. Paytm గాళ్ళంటే.. మేరె కదా ర..! హహహ్హహ్హాహ్హా

Comments are closed.