ఇనస్టాగ్రామ్ కలిపింది ఇద్దరినీ!

ఓసారి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేస్తున్న సమయంలో, నాగచైతన్యను ఎందుకు ఫాలో అవ్వడం లేదని ఓ వ్యక్తి ప్రశ్నించాడట.

పెళ్లికి ముందు నాగచైతన్య-శోభిత ఇనస్టాగ్రామ్ లో ఛాట్ చేసుకునేవారు. ఈ సంగతిని గతంలోనే వాళ్లు బయటపెట్టారు. అలా ఛాట్ చేస్తూనే, శోభితను లంచ్ డేట్ కు ఆహ్వానించాడు చైతూ. దాని కోసం ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి ముంబయి కూడా వెళ్లాడు.

ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. తెలియని విషయం ఏంటంటే, అసలు ఇనస్టాగ్రామ్ లో వీళ్లిద్దరూ ఎలా కలుసుకున్నారు? తాజాగా ఈ విషయాన్ని శోభిత బయటపెట్టింది.

శోభితతో నాగచైతన్య నేరుగా మాట్లాడలేదంట. అలా మాట్లాడకుండానే ఇనస్టాగ్రామ్ లో ఆమెను ఫాలో కొట్టాడు. శోభిత కూడా తనను ఫాలో అవుతుందని ఆశించాడు. కానీ శోభిత నోటిఫికేషన్లు చూడలేదంట. తనను చైతూ ఫాలో అవుతున్నాడనే విషయం కూడా ఆమెకు తెలియదంట.

ఓసారి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేస్తున్న సమయంలో, నాగచైతన్యను ఎందుకు ఫాలో అవ్వడం లేదని ఓ వ్యక్తి ప్రశ్నించాడట. ఆ ప్రశ్న ఎదురైన తర్వాత శోభిత చెక్ చేస్తే, నిజంగానే చైతూ తనను ఫాలో అవుతున్నాడని గ్రహించింది. ఆ వెంటనే అతడ్ని ఫాలో అవ్వడం మొదలుపెట్టింది.

అలా శోభిత రిప్లయ్ కోసం చాన్నాళ్లు వెయిట్ చేసిన చైతూ, ఆ తర్వాత ఆమెతో మాటమాట కలిపి ముగ్గులోకి దింపాడు. పెళ్లి చేసుకుందామనే ప్రపోజల్ కూడా చైతూనే చేశాడంట.

నిజానికి ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం శోభితకు లేదంట. ఎప్పుడైతే చైతూ తన జీవితంలోకి వచ్చాడో తన అభిప్రాయం మారిపోయిందని వెల్లడించింది.

4 Replies to “ఇనస్టాగ్రామ్ కలిపింది ఇద్దరినీ!”

Comments are closed.